India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా పోరాట శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా <<14199043>>ఇళ్లు కోల్పోయే వారికి<<>> పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు రీ సర్వే చేస్తున్నారు. ఓనర్ల నుంచి ఇంటి పత్రాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, తహశీల్దార్లు సంధ్యారాణి, అహల్య ఆధ్వర్యంలో కూల్చివేసే ఇళ్లకు RB-X పేరిట మార్కింగ్ చేస్తున్నారు.
గ్రేటర్ HYD పరిధిలోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే కొనసాగుతోంది. HYD జిల్లా పరిధిలోని మూసీపై 16 బృందాలు, రంగారెడ్డిలో 4, మేడ్చల్‌లో 5 బృందాలతో కలిపి మొత్తం 25 టీమ్స్‌తో సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను సర్వే బృందాల సభ్యులు సేకరిస్తున్నారు. బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు మార్క్ చేయనున్నట్లు వారు తెలిపారు.
గ్రేటర్ HYDలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం పేర్కొంది. తెల్లవారుజామున నగరంలో వర్షం కురిసింది. ప్రస్తుతం చల్లటి గాలులు వీస్తున్నాయి. KBR పార్క్, నెక్లెస్ రోడ్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం దర్శనమిస్తోంది. కూల్ వెదర్‌ను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.
మాదిగల రెండో విడత మేలుకొలుపు యాత్రకి సంబంధించిన కరపత్రాలను డా.పిడమర్తి రవి బాచుపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ నెల27, 28న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, 30, 1వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో ఈ యాత్ర జరుగనున్నట్లు తెలంగాణ మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చిరుమర్తి రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగించుకోవాలని DLSA కార్యదర్శి, Sr.సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. Sept 28న RR జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందన్నారు. కోర్టు ముందుకు ఇదివరకురాని, పెండింగ్, పరిష్కరించుకునే/రాజీపడే కేసులకు వేదికన్నారు. క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదా, డబ్బు రికవరీ, యాక్సిడెంట్, చిట్‌ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్కుబౌన్స్ వంటి కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
HYD అత్తాపూర్ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.
మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్‌లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.
సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్, షాయరీ నిర్వహించనున్నారు. దీన్ని వినిపించడానికి ప్రముఖ కళాకారులు రాన్నారు. బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.