RangaReddy

News July 3, 2024

హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా పెరుగుతోన్న నష్టాలు!

image

రాష్ట్రంలో అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23 శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్ యూనిట్లు ‘లాస్ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. 101 కోట్ల యూనిట్లు బిల్లింగ్‌లోకి రాలేదు. సగటు యూనిట్ ఖర్చు రూ.7 కాగా ఒక్క ఏడాదిలో రూ.707 కోట్లు ఖజానాకు గండిపడింది. దీంతో ఈ సర్కిల్‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది.

News July 3, 2024

HYD: అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYDకోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు తెలుగు,ఉర్దూ, ఇంగ్లిష్, కామర్స్, జంతుశాస్త్రం, ఫుడ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీబీఏ, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, జనటిక్స్, కెమిస్ట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సబ్జెక్టులను బోధించేందుకు ఈనెల 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్లను నేరుగా అకాడమిక్ డైరెక్టర్ ఆఫీస్‌లో ఇవ్వాలన్నారు.

News July 3, 2024

HYD: కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు..!

image

కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. వీటిని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే కాచిగూడ-బెంగళూర్, సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ-బెంగళూర్ వందే భారత్ 8 బోగీలతో నడుస్తుండగా మిగిలిన 2 రైళ్లు 16 బోగీలతో నడుస్తుండడం విశేషం.

News July 3, 2024

HYD: ఆడుకుంటూ వెళ్లి రైలెక్కారు.. పోలీసుల చేరదీత

image

బుద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు దిగి రోడ్డుపై ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు చేరదీశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్‌లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారిలో చిన్నారులు కార్తీక్ (6), చిన్న (4) ఆడుకుంటూ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లో రైలెక్కి బుద్వేల్ స్టేషన్‌లో దిగారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వారిని గమనించారు. వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అప్పగించారు.

News July 3, 2024

HYD: హిమాయత్‌నగర్‌లో గరిష్ఠ వర్షపాతం నమోదు  

image

నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. అరగంటలోనే హిమాయత్ నగర్‌లో 3.6 సెంటీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 1.2 సెంటీమీటర్లు, రాయదుర్గం, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బన్సీలాల్‌పేట్, మాదాపూర్, అబిడ్స్, తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గాలివాన కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడగా, పలుచోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

News July 3, 2024

HYD: అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

HYD నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.వరలక్ష్మీ తెలిపారు. ఆంగ్లం, అరబిక్, ఉర్దూ మీడియం(హిస్టరీ), కామర్స్, BBA, BBA ఈ-కామర్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్, జువాలజీలో అర్హులైనవారు ఈనెల 5 వరకు కాలేజీలో దరఖాస్తులు చేసుకోవాలని, 6న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

News July 3, 2024

HYD: వీరిలో ఒకరికి మంత్రి పదవి?

image

ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో మంత్రి పదవి కోసం RR జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి, HYD నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని ఇటీవల సీఎం చెప్పడంతో దానం ఆశలు సన్నగిల్లాయి. కాగా గతంలో దానంకు రేవంత్ రెడ్డి మాట ఇవ్వడంతో ఆశతో ఉన్నారు.

News July 3, 2024

గోల్కొండ దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్

image

చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ 14 మంది సభ్యులతో కూడిన బోనాల ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులను జారీ చేశారు. సభ్యులందరూ అరవింద్ మహేశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనాల ఉత్సవాల కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.

News July 3, 2024

HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

image

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

News July 3, 2024

HYD: నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలి: జాజుల

image

దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలని, నీట్ పరీక్ష పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.