India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
RR జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త, కంటి, దంత, చర్మ, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందు అందజేశారు. జిల్లా ప్రధాన జడ్జి శ్రీధర్ రెడ్డి NGOలను అభినందించారు. DLSA కార్యదర్శి శ్రీదేవి, జడ్జిలు పట్టాభిరామారావు, ADJలు పద్మావతి, ఆంజనేయులు, BAR కౌన్సిల్ PRSDT కొండల్ రెడ్డి, గోపీశంకర్ యాదవ్ ఉన్నారు.
గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.
HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుకుందని అధికారులు తెలియజేశారు. దీన్నిబట్టి గమనిస్తే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ రూ.కోటి విరాళం అందజేశారు. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. HYD నగరంలో ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగించినట్లు గుర్తిస్తే విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు.
స్వదేశీ అభియాన్ పథకం కింద రూ.99 కోట్లతో వికారాబాద్ అనంతగిరి కొండలను అభివృద్ది చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిలో మొదటి దశలో రూ.38 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. శంకర్పల్లి, మర్పల్లి రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.400 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని అడుగుతానని తెలియజేశారు.
2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ మంత్లీ బస్‌పాస్ కొద్ది రోజుల్లోనే 750 మంది కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రూ.1450 విలువైన ఈ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతోంది. ప్రస్తుతం నగరంలో 10,000 మంది ఆర్డినరీ, 75,000 మంది మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు.
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రిహబ్‌లో తొలుత 13 స్టార్ట్ అప్స్ ఏర్పాటయ్యాయని CEO విజయ్ తెలిపారు. గత మూడేళ్లలో వాటి సంఖ్య 92కి పెరిగిందని, మరో వెయ్యి అంకురాలు నమోదు చేసుకున్నాయన్నారు. 11 అంకుర సంస్థలు తమ ఆవిష్కరణపై మేధోసంపత్తి హక్కులు పొందాయని, 2,450 మంది తమ ఆలోచనలను పంచుకున్నారు. ఆరు వేల మంది రైతులు పరిశోధన కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
Sorry, no posts matched your criteria.