India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
HYD నగరంలో పంజాగుట్ట NIMSలో జెనెటిక్స్ రోగులకు డే కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్‌లోని CDFD సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి డాక్టర్ బీరప్ప తెలిపారు. ఇటీవల గర్భస్థ శిశువుల్లో వచ్చే గుండె, ఊపిరితిత్తుల వైఫల్యానికి కారణమయ్యే జన్యు లోపాలను పరిష్కరించే మార్గాన్ని వైద్యులు గుర్తించారు. ఈ మేరకు జెనెటిక్ రోగాలకు వైద్యం అందించనున్నట్లు తెలిపారు.
✒VKBD: SAVE దామగుండం ఉద్యమంలో ప్రొ.నాగేశ్వరరావు, విమలక్క
✒మహమ్మదాబాద్: రిపోర్టర్‌పై స్కూల్ యాజమాన్యం చిందులు
✒వికారాబాద్: శివరాంనగర్‌లో చైన్ స్నాచింగ్
✒ పలుచోట్ల భారీ వర్షాలు
✒ఎంపీ విశ్వేశ్వర్ తీరు బాధ్యతారాహిత్యం: AIKMS
✒దామగుండం: Way2Newsతో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి
✒ VKBకు KTRను తీసుకొస్తాం: BRS
✒ఘనంగా తాండూరు నూతన రజక కార్యవర్గ ప్రమాణ స్వీకారం
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని 1847 నాటి పురాతన పర్సి ఫైర్ టెంపుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ సైకిల్ లిస్టులో బృందం టెంపుల్ వెళ్లి సందర్శించి, ఆనాటి చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పేస్తోంజి, విక్కాజి మెహర్జీలు HYD, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
East HYDకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్, అంబర్‌పేట, మీర్‌పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్‌నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
HYD శివారులో RRR దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. RR, VKB జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలు భాగంగా ఉంటారు. వీరితో పాటుగా ఇతర జిల్లాల కలెక్టర్లు, R&B, NHAI అధికారుల బృందం కలిసి విస్తృతంగా అధ్యయనం చేపట్టనుంది.
Sorry, no posts matched your criteria.