India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరవాసులకు GHMC కీలక విజ్ఞప్తి చేసింది. ‘నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇంట్లోనే ఉండండి. అనవసర ప్రయాణాన్ని మానుకోండి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నూతన నిర్మాణాలు, శిథిలావస్థ భవనాలకు దూరంగా ఉండండి. వరదల్లో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో 040 21111111నంబర్‌ను సంప్రదించండి. అహోరాత్రులు సేవలు అందించేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం’ అని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.
భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రూట్‌లలో భారీగా ట్రాఫిక్ జామైంది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి రాణిగంజ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మరోవైపు భారీ వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడం బెటర్.
SHARE IT
RELAX అంటూ ఆన్‌లైన్‌లో అశ్లీల ఫొటోలు పంపి HYD యువకులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా బాగోతం వెలుగుచూసింది. నెల్లూరు వాసి వంశీకృష్ణ, HYDకు చెందిన పార్వతి కలిసి ఈ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు రేట్ ఫిక్స్ చేసి వ్యభిచారం నిర్వహించారు. నిఘాపెట్టిన CYB AHTUకి వీరికి చెక్ పెట్టింది. గతంలోనూ వీరు ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్‌కి వెళ్లారు. స్టడీ టూర్‌లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్-నాగపూర్ కారిడార్‌లోని 251KM హైవేను NHAI సంస్థ, హైవే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ట్రస్ట్‌కు టోల్-ఆపరేట్- ట్రాన్స్‌ఫర్ (TOT) మోడల్‌లో రూ.6,661 కోట్లకు కేటాయించినట్లుగా తెలిపింది. HYD నగరం నుంచి నాగపూర్, నాగపూర్ నుంచి HYD వెళ్లే వాహనదారుల నుంచి TOT మోడల్లో టోల్ ఛార్జీలను వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు.
HYD నగరంలో అనేక చోట్ల చిరు వ్యాపారులు ఫుట్ పాత్‌పై వ్యాపారం చేస్తున్నారు. వారందరికీ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ వ్యాపార సముదాయాలను అధికారులు తొలగించారు. వాటిలో పండ్ల దుకాణాలు, నర్సరీలు, గృహోపకర వస్తువుల దుకాణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఫుట్ పాత్‌పై వ్యాపారం చేయొద్దని సూచించారు.
వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని HYD నగరంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. 2024-25 తొలి త్రైమాసికంలో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3% పెరిగాయని, అదే సమయంలో రాష్ట్రంలో 11.3% వృద్ధి నమోదు అయినట్లుగా పేర్కొన్నారు.
రాజేంద్రనగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో IPS అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రోగ్రాంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ హోం అఫైర్స్ కేంద్రమంత్రి నిత్యానందతో పాల్గొన్నారు. తామిద్దరం 16వ లోక్ సభలో సహచరులుగా ఉండటం ఇదే మొదటిసారి అని తెలిపారు. నేపాల్, భూటాన్ ప్రాంతానికి చెందిన వారు సైతం ఇక్కడే ట్రైనింగ్ పొందినట్లు ఎంపీ పేర్కొన్నారు.
HYD నగరంలో రెండో దశ మెట్రో ట్రైన్ 5 మార్గాల్లో కలిపి అధికారులు 78.6 కి.మీ ప్రతిపాదించారు. 60కి పైగా స్టేషన్లు రానున్నట్లు తెలిపారు. రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాలపై ఇప్పటికే పలు మార్లు సీఎం చేసిన సూచనల మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను వేరువేరుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.