RangaReddy

News September 21, 2024

HYD: 5 మార్గాల్లో 78.6 కి.మీ మెట్రో

image

HYD నగరంలో రెండో దశ మెట్రో ట్రైన్ 5 మార్గాల్లో కలిపి అధికారులు 78.6 కి.మీ ప్రతిపాదించారు. 60కి పైగా స్టేషన్లు రానున్నట్లు తెలిపారు. రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాలపై ఇప్పటికే పలు మార్లు సీఎం చేసిన సూచనల మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను వేరువేరుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

News September 20, 2024

HYD: రేపే లాస్ట్.. CITDలో పోస్ట్ డిప్లొమా కోర్సులు!

image

HYD బాలానగర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CIT)లో పోస్ట్ డిప్లొమా కోర్సుల దరఖాస్తుకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. CITD అడ్మిషన్ డెస్క్ వద్ద శనివారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.citdindia.org సందర్శించండి.

News September 20, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

image

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్‌ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమంలో నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు దక్కినట్లు తెలిపారు.

News September 20, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

News September 20, 2024

సికింద్రాబాద్: వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదు

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వైరల్ జ్వరాల బాధితులు క్యూ కడుతున్నారు. వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 25 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News September 20, 2024

HYD: నేటి నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ మూసివేత

image

గచ్చిబౌలి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ఈనెల 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌లో SRDP శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు, వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

News September 20, 2024

HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి కాదు అబ్బాయి!

image

న్యూడ్ కాల్స్ పేరిట యువకులను మోసం చేస్తున్న వ్యక్తిని HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ వెబ్‌సైట్స్ ద్వారా వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బెంగుళూరు వాసి రిషద్ బేడీని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి లాగా ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, పలువురు యువకులను ఆకట్టుకున్నాడు. బాధితుల న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

News September 19, 2024

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.

News September 19, 2024

BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా

image

కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.

News September 19, 2024

HYD: పాత నేరస్థులతో ముఠా ఏర్పాటు.. వేషాలు మార్చి చోరీలు

image

<<14135182>>మారు వేషాలతో<<>> చోరీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. నిందితుడు సుధాకర్(33) నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఓ కేసులో జైలుకెళ్లి అక్కడ పాత నేరస్థుడు బండారిని కలిసి మరికొంత మందితో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వారు మహిళల్లా వేషాలు మార్చి చోరీలకు పాల్పడి సొత్తును సోదరుడు సురేశ్‌కు ఇచ్చి నగదు రూపంలోకి మర్చుకునేవారని తెలిపారు.