India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలో గత నెలతో పోలిస్తే పలుచోట్ల గాలి నాణ్యత మెరుగుపడింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) రిపోర్ట్ విడుదల చేసింది. జూపార్క్-129, బొల్లారం-103, పటాన్‌చెరు-82, ECIL-70, సోమాజిగూడ-75, కోకాపేట-69, HCU-68, నాచారం-60, సనత్‌నగర్-50గా నమోదైంది. గత నెలలో సనత్‌నగర్‌లో AQI ఏకంగా 150కి పైగా రికార్డైంది. AQI 100 ధాటితే శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి ప్రమాదం.

సరూర్‌నగర్ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని BJP నేతలు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, BJP ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల పక్షాణ BJP నిరంతరం పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

రాజ్‌భవన్ దిల్ కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకూ రావాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొన్నం తెలిపారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్, సైబర్ మహమ్మారి చేప కింద నీరులా విస్తరిస్తన్న నేపథ్యంలో డ్రగ్స్ నిరోధించడంలో కొంత ప్రగతి సాధించినప్పటికీ అది సరిపోదని, మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో కఠిన శిక్ష పడేలా స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నిపుణులైన అధికారులను నియమించాలన్నారు. ఈ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని చెప్పిన ప్రభుత్వం HYD నగరంలో పలుచోట్ల మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. సికింద్రాబాద్ జోన్లో స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లను గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి ప్రారంభించినట్లు తెలిపారు.

HYDలో ట్రాఫిక్ నియంత్రణ, కాలుష్యం తగ్గించటం కీలకమైన అంశాలుగా సీఎం రేవంత్ రెడ్డి SDRF సమావేశంలో ప్రసంగించారు. దీనిపై తమ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని తెలిపారు. మరోవైపు గత ఘటనలను పరిగణలోకి తీసుకొని, వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. విపత్తు సమయాల్లో శిక్షణ పొందిన వారు, ట్రాఫిక్ నియంత్రణకు సైతం కృషి చేస్తారన్నారు.

తెలంగాణ ప్రదాత ప్రియతమ నాయకురాలు సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్లళ్లో BRS ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే చేసిచూపించిందన్నారు. ఇప్పటివరకు 55వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

మంథని MLAశ్రీధర్ బాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా ఆయనకు CMరేవంత్ రెడ్డి ఐటీ, పరిశ్రమల శాఖలు కేటాయించడంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పెండింగ్ ఫ్లైఓవర్లు, నాలాల, రోడ్లు,స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం, కొత్త పరిశ్రమల ఏర్పాటు చేశారన్నారు. మీ కామెంట్?

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు HYD, ఉమ్మడి RRలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రూ.200 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, హైడ్రాతో అక్రమ నిర్మాణాల తొలగింపు ఇందుకు రూ.50 కోట్ల కేటాయింపు, చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళనకు రూ.1,500 కోట్ల కేటాయింపు, కొత్త పరిశ్రమలతో జాబ్స్, పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. మీ కామెంట్?

హైదరాబాద్ జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు MBBS పూర్తి చేసిన, అర్హత కల్గిన వారు walk in interviewకు హాజరు కావాలని DMHO డా వెంకటి ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్ GHMC భవనంలోని 4వ అంతస్తులో ఉన్న DMHO కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని వెల్లడించారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.