India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరంలో సాధారణ వర్షపాతాన్ని మించి సగటున 22% అత్యధికంగా నమోదైందని అధికారులు వెల్లడించారు. సిటీవ్యాప్తంగా సాధారణంగా 343 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. గరిష్ఠంగా 439.4 మి.మీ వర్షం నమోదు కావడం గమనార్హం. రంగారెడ్డిలో 292.2 మి.మీటర్ల వర్షపాతానికి 401.7 మిల్లీ మీటర్లు రికార్డు అయ్యింది. మేడ్చల్‌లో 331.0 మి.మీ నమోదు కావాల్సి ఉండగా.. 342.2 మి.మీ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
నగరంలో ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. సిటీలో భారీగా వర్షాలు కురిస్తే అత్యవసర పరిస్థితుల్లో అధికారులు విధుల్లో ఉండాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వానాకాలం పూర్తయ్యే వరకు 24 గంటల పాటు విధుల్లో ఉండాలని సూచించారు.
SHARE IT
హుస్సేన్‌సాగర్‌కు వరద కొనసాగుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లుగా ఉంది. నగరంలో కురిసిన వర్షాలతో సాగర్‌కి వచ్చే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సాగర్‌కి ఇన్ ఫ్లో 1027 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1130 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఎవరు ఉండవద్దని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మల్కం చెరువు పరిసరాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్షించారు. వరద ముంచెత్తడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. చెరువుకు వచ్చే వరద పెద్ద మొత్తంలో ఉండి, బయటకు వెళ్లే ఔట్ ఫ్లో ఆ స్థాయిలో లేకపోవడంతో సమస్య తలెత్తుతుందని అధికారులు తెలిపారు. మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను హైడ్రా కమిషనర్ సూచించారు.
బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, రంగారెడ్డి జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు.
నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వాటర్ లాగింగ్స్, కూలిన చెట్లకు సంబంధించి అందిన ఫిర్యాదుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ లాగింగ్స్‌కు సంబంధించిన 164 ఫిర్యాదుల అందినట్లు ఆయన వివరించారు.
ఆగస్టు 11న జరిగే జాతీయ నులిపురుగుల దినోత్సవంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని RR కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో DMHO వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. లేదంటే నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత ఏర్పడతాయన్నారు.
రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ(DEET)ను ప్రారంభించిందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో DEET పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రైవేట్ రంగంలో నిరంతర ఉపాధి లక్ష్యంగా ప్రారంభించిన DEETలో వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 82 ఫిర్యాదులకు వచ్చాయని, వాటిని పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.