India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.
‘ఆపరేషన్ పోలో’లో భాగంగా 1948-09-17న హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 76 ఏళ్లు పూర్తయినా ప్రతి ఏడాది కొత్త చర్చనే. విలీనమంటూ INC, సమైక్యత అని BRS-MIM, విమోచనమని BJP, సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, విద్రోహమని నిజాం పాలకుల మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. ఈ వ్యవహారంలో మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు..? కామెంట్ చేయండి.
బాలాపూర్ గణపతి ఉత్సవంలో లడ్డూ వేలం వెరీ స్పెషల్. 1994లో రూ.450తో మొదలై 2023లో రూ.27 లక్షలకు పలికింది. అయితే, ఈసారి లడ్డూ వేలంపాటలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా గత సంవత్సరం పలికిన డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు, ఎవరైనా ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలాపూర్ లడ్డూ వేలంపాట రేపు ఉదయం 9:30కు ప్రారంభం కానుంది.
HYD నగరంలో గణపతి నిమజ్జనం, శోభాయాత్రలకు నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమైందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 122 వాటర్ క్యాంపులు, 35 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేసామన్నారు. రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా ఆదేశించారు. అవసరమైన చోటా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జనరల్ మేనేజర్లకు సూచించారు.
HYD నగరంలో ఖైరతాబాద్ వినాయకుడు వద్ద నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇప్పటికే భక్తులకు దర్శనాలు నిలిపివేసి,మండప తొలగింపు పనులు చేపట్టారు.సమయానికి పనులు అయ్యేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుడు ఈ రోజు సాయంత్రం టస్కర్ మీదకు వెల్డింగ్ పనులు చేయనుండడంతో సమయానికి పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
70 టన్నుల ఖైరతాబాద్ గణేశ్ రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాగా విగ్రహ తయారీ అప్పుడు 30 టన్నుల స్టీలు, గుజరాత్ గాంధీనగర్ నుంచి 35 కిలోల బరువున్న ప్రత్యేక మట్టి 1000 బ్యాగులు, 50 కిలోల బరువున్న 100 బండిళ్ల వరి గడ్డి, 10 కిలోల బరువున్న వరి పొట్టు 60 బస్తాలు, 10 ట్రాలీల సన్న ఇసుక, 2 వేల మీటర్ల గోనె బట్ట, 80 కిలోల సుతిలీ తాడు, 5 వేల మీటర్ల మెష్, 2500 మీటర్ల కోరా బట్ట, టన్ను సుతిలీ పౌడర్ వినియోగించారు.
HYD నగరంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లిబరేషన్ డే కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. రేపు నిర్వహించే వేడుకల్లో CAPF, డిఫెన్స్ పోలీసుల మార్చ్, 5 రకాల డ్రం డాన్సులు, డిజిటల్ ఎగ్జిబిషన్, 800+ఫోక్ అండ్ ట్రెడిషనల్ కళల నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వెల్లడించింది.
HYD నగరంలో గణపతి నిమజ్జనం వేళ ఈ నెల 17న ఉ.6 నుంచి 18న ఉ.8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంట్రాసిటీ, ఇంటర్ సిటీ ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలకు ORR నుంచి HYD సిటీ లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ లేదని పోలీసులు వెల్లడించారు. గణపతి నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఆర్టేరియల్ రోడ్లు, ORR, సర్వీస్ రోడ్లలోనే ఉండాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగి PSకు బదిలీ చేశారు. HYD సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ డాన్సర్ (21) ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో FIR నమోదు చేసి తదుపరి విచారణకు నార్సింగి పోలీసులకు అప్పగించారు.పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.
HYD నగరంలో సెప్టెంబర్ 17న ఒకేరోజు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుపనుంది. అదే రోజును రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సెప్టెంబర్ 17న ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సైతం ప్రారంభంకానుంది.
Sorry, no posts matched your criteria.