India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ రైజింగ్ పేరున ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీ, గాంధీ ఆస్పత్రిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి గాంధీ ఆస్పత్రి, గాంధీ మెడికల్ కాలేజీ భవనాలను రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో రెండు భవనాలు అందరిని ఆకర్షించాయి.

TGPSC ఛైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకం పట్ల ఓబీసీ హక్కుల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. బీసీ వ్యక్తికి కమిషన్ సారథిగా అవకాశం కల్పించాలని నవంబర్ 16న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

TG, AP సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన తన పదవిని చేపట్టినట్లు తెలిపారు. HYD సికింద్రాబాద్‌లో అధికారికి ఘనంగా సన్మానం జరిగింది. అధికారికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద కమాండింగ్ చేసిన అపూర్వ అనుభవం ఉంది. అనేక దశల్లో వివిధ ఆపరేషన్లు నిర్వహించారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ, DSC, NDA అల్యూమినిగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా నవంబర్ 24న 170 నగరాల్లో నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)- 2024కు సంబంధించిన ప్రొవిజనల్ కీ డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డిసెంబర్-5 రాత్రి వరకు iimcat.ac.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. IIMలలో ప్రవేశానికి ఈ పరీక్షలో ప్రతిష్టాత్మక స్థానం ఉన్న విషయం తెలిసిందే.

> చేవెళ్ల, VKB,కోహెడ, సికింద్రాబాద్, శంకర్‌పల్లి యాక్సిడెంట్ ఘటనల్లో 10మంది చనిపోగా 10మందికి గాయాలు.
> బాచుపల్లి, అన్నోజిగూడలో ఇద్దరు విద్యార్థులు, అల్వాల్‌లో మహిళ, హయత్‌నగర్‌లో వ్యక్తి సూసైడ్
> ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్, మునిపల్లిలో శంషాబాద్ వాసి, నేరేడ్‌మెట్‌లో వ్యక్తి హత్యలు
> జవహర్‌నగర్‌లో బాలికపై అత్యాచారం
> చేవెళ్ల, కాటేదాన్, పుప్పాలగూడ, దోమలో ప్రమాదవశాత్తు నలుగురు మృతి

వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5,899 రివార్డు పాయింట్లు వస్తాయనే ఓ మెసేజ్ వచ్చిందా..? జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీసులు సూచించారు. ‘సోషల్ మీడియాలో APK ఫైల్ యాప్ పంపిస్తున్నారు. క్లిక్ చేస్తే వాట్సాప్ ప్రొఫైల్ యూనియన్ బ్యాంక్ ఫొటోగా మారుతుంది. తర్వాత ఎడిట్ కూడా కావడం లేదు. దీనిపై జాగ్రత్త..!’ అని పోలీసులు సూచించారు. SHARE IT

నగరంలో పలుచోట్ల పాములు కనిపించినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి వారికి వెటర్నరీ అధికారులు శుభవార్త తెలిపారు. పాముల సంబంధిత ఫిర్యాదుల కోసం బోర్డు పై ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే వారు వచ్చి, పాములను పట్టుకుంటారని GHMC అధికారులు పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదంలో రైతులు ప్రేమ్(ఆలూరు), రాములు(ఆలూరు), సుజాత(ఖానాపూర్ ఇంద్రారెడ్డినగర్) అక్కడికక్కడే చనిపోయారు.

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరాపార్క్ స్మారక స్థూపం వద్ద తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.

ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఓయూ పరిధిలో వివిధ డిగ్రీ కోర్సుల ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.