India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో హైడ్రా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, లేటెస్ట్ హిస్టారికల్ సాటిలైట్ డేటాపై చర్చలు జరిపారు. ఏరియల్ సర్వీస్, డిజిటల్ మ్యాపింగ్ హైడ్రాకు ఖచ్చితమైన విశ్లేషణ, ప్రణాళిక చేసేందుకు అవసరమని తెలిపారు. వాతావరణాన్ని అంచనా వేయడం, నీటి వనరులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
HMWSSB ఆధ్వర్యంలో గ్రేటర్ HYDలో 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగుతుందని, ఇప్పటి వరకు 6,13,562 మందికి ఈ పథకం అందిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీని ద్వారా 11,85,479 గృహాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 2020లో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆగస్టు 31 నాటికి రూ.1108.88 కోట్ల మేర జీరో బిల్ అందించినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రోలో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?
HYDలో గణేశ్ నిమజ్జనాలు మొదలయ్యాయి. బుధవారం 5వ రోజు పూజలు అందుకుంటున్న గణనాథులు సాయంత్రం భారీ జులూస్ నడుమ ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్ ప్లాజా ఎదుట క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం, మరేదైనా మత్తు పదార్థాలు తాగిన వ్యక్తులను అనుమతించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు చేసుకోవాలన్నారు.
SHARE IT
HYD నగరంలో గణపతి నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఉంటుందని సీపీ CV ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, తదితర పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, కమ్యూనల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.
సికింద్రాబాద్(లష్కర్)లో వివిధ రకాల గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కలాసిగూడలో శ్రీలక్ష్మీ గణపతి అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేశుడు వెరైటీగా ఉండి, భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. శ్రీమహావిష్ణువుతో కూర్చొని పాచికలు ఆడుతున్నట్లుగా ఏర్పాటు చేసిన విగ్రహాల సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. 108 రకాల స్వీట్లను తయారు చేసి, గణేశుడికి నైవేద్యంగా పెట్టారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు వెళ్లే రోడ్లను విస్తరించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామన్నారు.
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా అధ్యక్షతన ప్రజా భవన్లో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో GHMC మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.10,500 కోట్లు కేటాయించాలని అభ్యర్థించినట్లు చెప్పారు.
HYD ఉమెన్ సేఫ్టీ వింగ్ DGP, CID, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా సేవా గుర్తింపు అవార్డు అందుకున్నారు. సైబర్ క్రైమ్ అనాలిసిస్ టూల్ సమన్వయ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు అందించారు. అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని DGP సంతోషం వ్యక్తం చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షిర్డీ సాయినాథుడిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు స్పీకర్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం హారతి సమయంలో మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్‌తో కలిసి సాయినాథుడిని మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Sorry, no posts matched your criteria.