RangaReddy

News June 23, 2024

HYD: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

image

ప్రేమిస్తున్నాను అంటూ ఇంటర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన యువకుడి పై నారాయణగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఖలీల్ నారాయణగూడలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖలీల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు.

News June 23, 2024

HYD: మైనర్లు డైవింగ్ చేస్తే.. వాహన యజమానులకు జైలు శిక్ష

image

వాహన యజమానులూ తస్మాత్ జాగ్రత్త.. ఇకపై వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్ల మీదకు వస్తే బైక్ యజమానులపై కేసులు తప్పవని సిటీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే ఆ వాహన యజమానికి 3 నెలల జైలు శిక్షతోపాటు, రూ.5వేల జరిమానా విధించనున్నట్లు సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు.

News June 23, 2024

HYD: భాజపా రాష్ట్ర కార్యాలయంలో బలిదాన్ దివస్ కార్యక్రమం

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, విజయ రామారావు తదితరులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

News June 23, 2024

RR: దయనీయంగా ఆదర్శ ఉపాధ్యాయుల పరిస్థితి

image

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గంటల ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పాఠశాల పని దినాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని పీరియడ్‌కు రూ.182చొప్పున వేతనాలు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పని దినాలకు సంబంధించి ప్రతినెల 130 పీరియడ్లు బోధిస్తున్నప్పటికీ కేవలం 100పీరియడ్లకు మాత్రమే వేతనాలు అందుతున్నాయని, శ్రమ దోపిడీకి గురవుతున్నామని వాపోతున్నారు.

News June 23, 2024

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా 292 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 80 కార్లు, రెండు హెవీ వెహికల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఐటీ కారిడార్‌లో 182 మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారన్నారు.

News June 23, 2024

HYD: ఇలా బండి నడిపితే మూడేళ్లు జైలుకే..!

image

గ్రేటర్ HYD వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రాంగ్ రూట్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. SHARE IT

News June 23, 2024

HYD: గాంధీ ఆస్పత్రిలో వృద్ధులకు ప్రత్యేక వార్డులు: సూపరింటెండెంట్

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మొత్తం 40పడకలతో ఏర్పాటు చేస్తున్న వార్డులను పురుషులు, మహిళలకు వేర్వేరుగా 20పడకలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వార్డుల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా సుందరంగా ముస్తాబు చేస్తున్నామని, త్వరగా వాటిని తీర్చిదిద్ది మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు.

News June 23, 2024

HYDలో మరో MURDER..?

image

గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన HYD చందానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చందానగర్ హుడాకాలనీ సాయిబాబా ఆలయం ఆనుకొని ఉన్న నిర్జన ప్రదేశంలో మహిళ(40) మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లుగా అనుమానించారు. మృతురాలి ఎడమ చేతిపై బాలయ్య అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. కేసు నమోదు చేశారు.

News June 23, 2024

HYD: మాజీ ప్రియుడిపై కేసు నమోదు

image

మాజీ ప్రియుడి వేధింపులకు తట్టుకోలేని ఓ గృహిణి HYD మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీర్‌పేట్ పరిధి రహమత్‌నగర్‌లో నివాసముంటున్న గృహిణిని ఆమె మాజీ ప్రియుడు ఆర్బాజ్ ఖాన్ కలవాలని, లేకపోతే గతంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన బాధితురాలు PSను ఆశ్రయించగా కేసు నమోదైంది.

News June 23, 2024

HYD: నంబర్ ప్లేట్ మార్చితే చీటింగ్ కేసులు నమోదు

image

చలానాల నుంచి తప్పించుకునేందుకు పలువురు వాహనాల నంబర్ ప్లేట్ తారుమారు చేయటం, కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ HYDలో నంబరు ప్లేటు లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న 85 వాహనాల్లో 35 మంది యజమానులపై కేసు నమోదు చేశారు. 40 మంది మైనర్లను పట్టుకున్నారు.180/177 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.