India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.
HYDలో సైబర్ నేరాల నియంత్రణకు, 7 జోన్లలో ప్రత్యేక సైబర్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజూ 20-30 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వస్తుండగా, రూ.లక్ష వరకు నష్టపోయిన కేసులను స్థానిక పోలీస్ స్టేషన్లలో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరాల పై త్వరగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయడమే ఈ సెల్స్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
HYD శివారులో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ట్రామా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,116 కోట్లు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ హవర్ మిస్ కాకుండా ఉంటే ప్రాణాలు కాపాడొచ్చని, క్షతగాత్రులకు వైద్యం అందించటం ట్రామా కేంద్రాల ద్వారా సాధ్యమని ప్రభుత్వం నమ్ముతోంది.
ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌ల పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యం’ అని అన్నారు.
HYD పోలీస్ కమిషనర్‌గా మరోసారి నేడు CV ఆనంద్ (డీజీపీ ర్యాంక్ IPS) తన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాదిలో జరిగిన సీపీ మార్పుల్లో ఒకటి, నాలుగో స్థానాలు ఆయనవే. 2,3 స్థానాల్లో సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అంతేకాక 21 ఏళ్ల తర్వాత డీజీపీ స్థాయి అధికారిని HYD నగర పోలీస్ కమిషనర్‌గా నియమించడం ప్రత్యేక విషయం. నూతన సీపీకి నగర ప్రజలు X వేదికగా స్వాగతం పలికారు.
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఈనెల 5న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమల కమిషనర్ డా.జీ.మల్సూర్ అవార్డును అందుకున్నారని తెలిపారు. అత్యుత్తమ సాధకులు (టాప్ అచీవర్స్)గా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు.
అర్హత ఉన్నా పలువురికి వంట గ్యాస్ సబ్సిడీ అందడంలేదని ఆరోపిస్తున్నారు. జీరో బిల్లులకు అర్హత సాధించినా గ్యాస్ సబ్సిడీ ఎందుకు అందడం లేదని, కారణమేంటని గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్రేటర్ HYD పరిధిలో 17 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో 7.4 లక్షల మందికే జీరో బిల్లు అమలవుతుండగా.. కేవలం 3 లక్షల మందికే వంట గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది.
పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండు రంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694మంది ఉండగా, అబ్బాయిలు 5,811మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.
టీజీసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 33,764 మంది అటెండ్ కానున్నారని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ గడ్డం నరేశ్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2 నుంచి సా. 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పోలీసు, ఆబ్కారీ యంత్రాంగం సిద్ధమైంది. వారాంతపు సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. అనుమానితుల మూత్ర నమూనాలు సేకరించి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ ద్వారా కేవలం 2-5 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించిన వారితో మత్తుపదార్థాల సరఫరాపై వివరాలు తెలుసుకొని కీలక వ్యక్తుల అరెస్టుకు సిద్ధమవుతున్నారు.
Sorry, no posts matched your criteria.