RangaReddy

News June 23, 2024

HYD: 40 ఎకో టూరిజం స్పాట్లు: మంత్రి

image

రాష్ట్రంలోని 12 సర్యూట్‌లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సచివాలయంలో ఉన్న అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఎకో టూరిజం కన్సల్టేటివ్‌ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అడ్వెంచర్‌, రిక్రియేషన్‌, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్‌, నేచర్‌ వైల్డ్‌లైఫ్‌, హెరిటేజ్‌-కల్చర్‌ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తిస్తామన్నారు.

News June 23, 2024

HYD: పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి కృత్రిమ మేధ

image

హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడానికి కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. HYDలోని సచివాలయంలో ఉన్న తన ఛాంబర్‌లో ‘ఈజీ పార్క్‌ ఏఐ’ సంస్థ డిజిటల్‌ ప్రెజెంటేషన్‌ను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కింగ్‌ స్లాట్‌ను ముందే బుక్‌ చేసుకునేందుకు యాప్‌లను రూపొందించాలని పేర్కొన్నారు.

News June 23, 2024

HYD: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీశాయి..!

image

రెండు వేర్వేరు ఘటనల్లో వివాహేతర సంబంధాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పోలీసులు తెలిపిన వివరాలు..పాతబస్తీ వాసి జాకీర్(29)కు వట్టేపల్లికి చెందిన మహిళకు వివాహేతర సంబంధం ఉంది.జాకీర్ తరచూ ఆ మహిళ ఇంటికి వస్తుండడంతో ఆమె భర్త, సోదరుడు కలిసి జాకీర్‌ను చంపేశారు. మరో ఘటనలో RRజిల్లా షాబాద్ వాసి సంతోష(36)కు, షాద్‌నగర్ వాసి సత్తయ్యకు వివాహేతర సంబంధం ఉంది. ఆమె మరికొందరితో కలుస్తుందనే అనుమానంతో సత్తయ్య ఆమెను చంపేశాడు.

News June 23, 2024

HYD: వాట్సాప్‌లో మెనేజ్.. రూ.16.68 లక్షలు స్వాహా

image

గూగుల్ మ్యాప్‌లో రేటింగ్ ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు రూ.16.68 లక్షలు స్వాహా చేశారు. HYDకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి గూగుల్ టాస్క్ చేసి ఆదాయం పొందండి అంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. లింక్ క్లిక్ చేసిన బాధితుడు టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. మొదటగా కొన్ని టాస్క్‌లు చేసిన తర్వాత పెట్టుబడులు పెట్టాలంటూ సూచించారు. విడతల వారీగా రూ.16.68 లక్షలు దండుకున్నారు. మోసపోయానని బాధితుడు PSను ఆశ్రయించాడు.

News June 23, 2024

HYD: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి: మంత్రి

image

హెల్త్‌ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే సహించబోమన్నారు.

News June 23, 2024

రేపు GHMCలో ప్రజావాణి

image

2 వారాల సెలవు ముగించుకుని కమిషనర్ రోనాల్డ్ రాస్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు GHMC తెలిపింది. ఉదయం 10:30 నుంచి ఉ.11:30గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుందని, ప్రజలు 040-23222182 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలపాలని అధికారులు తెలిపారు. అనంతరం ప్రజావాణికి హాజరైన నగర వాసుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

News June 23, 2024

HYD: ఎకో టూరిజం కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంత్రి కొండా సురేఖ

image

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంత్రి కొండా సురేఖ, మరో 16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ శనివారం HYDలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకో టూరిజం అభివృద్ధి కోసం కమిటీ మూడు సమావేశాల్లో ఆయా టూరిజం స్పాట్స్‌ను గుర్తించాలని సూచించింది. ప్రత్యేకమైన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.

News June 23, 2024

HYD: బోనాల బడ్జెట్‌ రూ.25 కోట్లకు పెంచాలని సీఎంకు వినతి

image

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ను రూ.25 కోట్లకు పెంచాలని భాగ్యనగర్‌ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్‌ గాజుల అంజయ్య కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో బోనాల బడ్జెట్‌ రూ.15 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.

News June 23, 2024

HYD: ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం: రాంచందర్‌

image

ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఛైర్మన్‌ చెరుకు రాంచందర్‌ అన్నారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. మాదిగ జాతిని, వారి ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.

News June 23, 2024

HYD: ఉత్సాహంగా ప్రారంభమైన షూటింగ్‌ పోటీలు

image

HYD గచ్చిబౌలిలోని సాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌లో 10వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌సంగి ప్రారంభించారు. ఈ పోటీల్లో 10ఎం రైఫిల్‌ ఓపెన్‌/సైట్‌ రైఫిల్‌, 25ఎం ఫిస్టల్‌, 50ఎం ఫిస్టల్‌, 10ఎం ఫిస్టల్‌ ఈవెంట్‌లలో 200 మందికి పైగా పోటీదారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.