India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అంటే ఈనెల 17వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన కోరారు.
వినాయక చవితి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు నాగోల్, ధూల్‌పేట్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండడంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని కేంద్రమత్రి బండి సంజయ్ HYDలో అన్నారు. నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం TG, APకి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఇదీ రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి.. రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.
జైనూరు ఘటనలో బాధితురాలని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మహిళ ముఖంపై ఉన్న గాయాలు చూసి మనసు చెలించిపోయిందని మంత్రి అన్నారు. మహిళ ప్రాణాల కంటే, ఓవైసీ పర్నిచర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, హిందూ యువతపై ఘర్షణ పేరిట అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని? ప్రశ్నించారు.
తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (GSDP) 2036 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం GSDP 176 బిలియన్ డాలర్లుగా ఉందని, వచ్చే 12 ఏళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని వెల్లడించింది. HYDలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ (AI) సదస్సు సందర్భంగా నిన్న విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
రుణమాఫీ కాలేదని రైతన్నలు ధైర్యాన్ని కోల్పోవద్దని, రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మేడ్చల్లో రుణమాఫీ కాలేదని రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం బాధ కలిగించిందన్నారు. పంట పండించే రైతన్న ప్రాణాలు కోల్పోయి గాంధీ ఆసుపత్రి వద్ద ఉంటే మనసు చలించి పోయిందన్నారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.
గణేష్ ఉత్సవాల్లో భాగంగా మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మండపం ఏర్పాటు, విగ్రహం ఎత్తు, ప్రాంతం, ఊరేగింపు, నిమజ్జనం తదితర వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు.
HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.
ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం నిర్మించిన 2 కొత్త హాస్టల్ భవనాల నిర్మాణ పనులను నేడు మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్నారు. 10,286 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెంటల్ హాస్టల్ నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఏడాదిలో బిల్డింగుల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తుంది.
చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అటకెక్కించింది. వీధుల్లో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగం నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలకు చెత్త డబ్బాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశాలిచ్చింది. అదనంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా 20కేజీల బరువును తట్టుకునే మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.