India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీస్‌లోనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. రైతు సురేందర్ రెడ్డి (52) ఇవాళ ఉదయం అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలోని చెట్టుకు తాడుతో ఉరేసుకొని మృతి చెందాడు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా నీరజ్ అగ్రవాల్ గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు ఆయన దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. నారాయణగూడ IPM బృందం 4 కేసుల్ని నిర్ధారించింది. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న పశ్చిమబెంగాల్‌కి చెందిన వ్యక్తికి, టోలీచౌకికి చెందిన మరో వృద్ధుడు, హైదర్‌నగర్‌కు చెందిన మహిళ, జార్ఖండ్ నుంచి HYD వచ్చిన ఓ మహిళకు ఫ్లూ సోకినట్లు తేల్చింది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన వెలుగుచూసింది. పెద్ద చెరువులో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హస్తినాపురానికి చెందిన మంగ కుమారి(తల్లి), శరత్(కుమారుడు), లావణ్య(కూతురు)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. లావణ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.
ఆరో తరగతిలో ఆంగ్లం బోధించే ప్రదీప్ మాస్టారు పాఠాలు చెప్పే విధానం నచ్చేదని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. ఈ మేరకు గురువుల దినోత్సవం సందర్భంగా ఆయన పంచుకున్నారు. ‘మాస్టారు అందరూ ఇంగ్లిషులో మాట్లాడేందుకు ప్రోత్సహించారు. అప్పటినుంచి ఆంగ్ల భాషపై పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించాను. పదో తరగతి వచ్చేసరికి ఆంగ్లభాషలో మాట్లాడే స్థితికి చేరుకున్నా’ అని తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్, కమిటీ సభ్యులు ఉన్నారు.
HYD సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ISB సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. టీ హబ్‌లో అనేక అంకురాలు మొగ్గ తొడిగి పెద్ద సంస్థలుగా విస్తరించినట్లు తెలిపారు. నూతన ఆలోచనలతో వేలాదిమందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లే తొలి గురువుగా పేర్కొన్నారు. ప్రాథమిక, హై స్కూల్ దశలో మాధవి, జయంత్‌నాథ్, సోమయాజులు, లక్ష్మణరావుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. జూనియర్ కాలేజీలో మంజుసూరి, బీకాం చదివేటప్పుడు రఘువీర్ సార్లు ప్రతి అంశంలోనూ అవగాహన కల్పించే వారన్నారు. వారి ప్రేరణతోనే సివిల్స్ వైపు అడుగేసి విజయం సాధించానని వివరించారు.
HYD ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, పాతబస్తీ, కోఠి తదితర ప్రాంతాల్లో కలుషిత తాగు నీరు సరఫరా కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలియాబాద్ సెక్షన్ పరిధిలోనూ పలుచోట్ల నుంచి ఈ సమస్యపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. మంచినీటిలో మురుగు నీరు కలిసి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సెక్షన్ పరిధిలో అధికారిక యంత్రాంగం మంచినీటి పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు.
Sorry, no posts matched your criteria.