India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన అదుకోవాలని దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరదల్లో మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు.
వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల వివరాలను నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెగిన కాలువలు, కుంటలు, చెరువు కట్టలు, కల్వర్ట్‌లపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYD, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT
నగరంలో ప్రయాణికులు మెట్రోకి మొగ్గు చూపుతున్నారు. దీంతో 5 లక్షల మార్క్ దాటింది. అన్ని స్టేషన్ల వరకు ఫీడర్ సర్వీస్లు లేకపోవడంతో ప్రయాణికులు సొంత వాహనాల్లో స్టేషన్లకు రావాల్సి వస్తోందంటున్నారు. అయితే ఇటీవల పార్కింగ్ ఫీజుల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అన్ని ప్రాంతాల నుంచి ఫీడర్ సర్వీసులు ఉంటే వాహనం తేవాల్సిన అవసరం లేదని ప్రయాణికులు అంటున్నారు. మెట్రో కోచ్లు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధి హస్మత్‌పేటలోని 13.17 ఎకరాలకు సంబంధించి NVN కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తక్షణ చర్యలు తీసుకోకుండా… హైడ్రా, ఇతర అధికారులపై తెలంగాణ హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.
గురుకుల విద్యపై ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస నేత RS. ప్రవీణ్ కుమార్ వాపోయారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడారు. ‘గురుకులాల్లోని 2,000 మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి. కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్య అందించారు. ప్రభుత్వం కుట్రకు ఎస్సీలే సమిధలవుతున్నారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.
గచ్చిబౌలి పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల సమక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై గ్లోబల్ సబ్ సమ్మిట్ జరిగింది. AI సిస్టమ్స్ ప్రాముఖ్యతపై నిపుణుల బృందం విస్తృతంగా చర్చించినట్లు తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.
గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.
బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.
హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.