RangaReddy

News September 4, 2024

HYD: హైడ్రా GOOD NEWS.. ఇక ఈజీ!

image

HYD నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, ప్రజల నుంచి వినతులను సైతం స్వీకరిస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తులో సామాన్య మానవుడు సైతం చూసుకునేలా చెరువులు, కుంటల FTL, బఫర్ జోన్ వివరాలను యాప్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తద్వారా భూమి కొనుగోలు చేసేటప్పుడు అందరూ చెక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. అక్రమాలు, సహా ఇతర ఫిర్యాదులను సైతం యాప్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

News September 4, 2024

HYD: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, సూచనలు

image

✓HYD హిమాయత్‌సాగర్ జలాశయం 4 ఫీట్ల నీటిమట్టం పెరిగితే నిండిపోతుంది ✓వర్షాలు తగ్గడంతో ఇన్‌ఫ్లో తగ్గింది
✓ఒక్క వర్షం వచ్చినా జలాశయం పూర్తిగా నిండి పోతుంది
✓జలయశయం నిండితే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✓HYD, RR జిల్లా కలెక్టర్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
✓ఎప్పటికప్పుడు అధికారిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షించాలి.

News September 4, 2024

HYD: సెప్టెంబర్ 17న ప్రత్యేక కార్యక్రమాలు

image

HYD నగరంలోని పరేడ్ గ్రౌండ్ వద్ద సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. మరోవైపు HYD,RR, MDCL,VKB జిల్లాల వ్యాప్తంగా అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ప్రభుత్వం,వీటికి సంబంధించిన వివరాలు సేకరించనుంది.

News September 4, 2024

HYD: 4 రోజుల్లో 12 నెలలకు సరిపడేంత వర్షం

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.

News September 4, 2024

HYD: 200 ఎకరాల్లో AI సిటీ: మంత్రి

image

తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News September 4, 2024

రంగారెడ్డి: కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

image

రంగారెడ్డి జిల్లాలోని 100 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ పెండింగ్‌లో ఉందని కలెక్టర్ శశాంక అన్నారు. ఇప్పటి వరకు 925 చెరువుల్లో 99 చెరువులకు మాత్రమే ఫైనల్‌ నోటిఫికేషన్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా 820 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. 

News September 4, 2024

HYD: రాహుల్ ద్వంద్వ వైఖరి: కేటీఆర్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. ‘X’ వేదికగా మంగళవారం స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్‌తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ జీ’ అని ప్రశ్నించారు.

News September 4, 2024

HYDను క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యం: CM

image

HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

News September 4, 2024

HYD: గెజిట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం

image

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు సమీప గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని 51 గ్రామ పంచాయతీలను వాటి సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేయడం ద్వారా పట్టణ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

News September 3, 2024

WOW: అయోధ్య మందిరంలో బాలాపూర్‌ గణేశుడు!

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్‌ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.