India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంపూర్ణ పోషకాహారం, వ్యాయామం శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. HYD కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ‘అందరికీ పోషకాహారం’ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు.
✓గచ్చిబౌలి జంక్షన్- GPRA క్వార్టర్స్ వద్ద లెఫ్ట్ టర్న్-రైట్ టర్న్ గోపీచంద్ అకాడమీ-లెఫ్ట్ టర్న్ ఇన్ఫోసిస్ విప్రో జంక్షన్-రైట్ టర్న్ గోపనపల్లి- HC యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి లింగంపల్లి
✓లింగంపల్లి నుంచి HCU డిపో వద్ద లెఫ్ట్ టర్న్-మజీద్ బండ-బొటానికల్ గార్డెన్-రైట్ టర్న్ గచ్చిబౌలి
✓సెప్టెంబర్ 3,6,9న సా.4 నుంచి రా.9 వరకు ఈ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు.
HYD నగరంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ DGP షికా గోయల్ హోటల్ అగ్రిగెటర్ల మీటింగ్లో ఈ సూచనలు చేశారు.
✓రెంటుకు ఇచ్చేటప్పుడు సరైన భద్రత చర్యలు పాటించాలి
✓ఐడి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి
✓హోటళ్లలో CCTV బ్యాకప్ ఉండాలి ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్ నెంబర్ అందించాలి ✓హోటళ్లలో మహిళా భద్రతపై కఠినంగా వ్యవహరించాలి.
జీహెచ్ఎంసీ పరిధిలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ‘హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న ఆవాంఛనీయ ఘటన జరగడానికి వీల్లేదు. విద్యుత్, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. కూలీలు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండిపోతారు. వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.
HYD హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన వ్యవహారంపై ఏటా చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం సరికాదంది. ఇప్పటికే ఇందులో ఉత్తర్వులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈనెల9వ తేదీకి వాయిదా వేసింది. కాగా హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఏటా చర్చ జరుగుతోంది.
దివ్యాంగులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వల్ల ఎవరి హక్కులకూ భంగం కలగలేదని, ఎవరూ నష్టపోలేదని, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.
ప్రత్యేక అధికారులు ప్రతినెలా 10 పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో డీఈవో, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలను సందర్శించి నివేదికలు సమర్పించడానికి నియమించబడిన ప్రత్యేక అధికారులు వారానికి 2, నెలలో 10 పాఠశాలలను పరిశీలించాలని అన్నారు.
వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.
HYD వాతావరణ కేంద్రం ఆగస్టు 27న పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని MLA KTR తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసినా.. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువ శాస్త్రవేత్త, 20 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..?
HYD నగర ప్రజలకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కప్-2024 సెప్టెంబర్ 3, 6, 9వ తేదీలలో GMCB గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, IIIT సర్కిల్ నుంచి విప్రో రూట్‌లో ఆయా రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.