RangaReddy

News September 2, 2024

HYD: ప్రొ.నాగేశ్వర్‌పై దాడి చేస్తాననడం అప్రజాస్వామికం: హరీశ్‌రావు

image

మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ రావుపై కొంత మంది బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాజకీయ విమర్శలను జవాబుగా రాజకీయ విమర్శలతోనే ఎదుర్కోవాలిగాని, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుర్భాషలాడటం అప్రజాస్వామికం అన్నారు.

News September 2, 2024

HYD: అత్యవసరంగా విజయవాడ, ఖమ్మం వెళ్లాలా?

image

HYD నుంచి విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు అత్యవసరంగా వెళ్లాలంటే ఈ రూట్లలో వెళ్లండి.
✓HYD నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ
✓HYD నుంచి చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మరిపెడ బంగ్లా, ఖమ్మం
✓HYD పోలీస్ ట్రాఫిక్ హెల్ప్ లైన్‌కు 9010203626 సంప్రదించాలని తెలిపారు.

News September 2, 2024

BREAKING..HYD: రెయిన్ ఎఫెక్ట్.. నేడు 18 రైళ్లు రద్దు

image

తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షంతో అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. దీంతో నేడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు దాదాపు 18 రైళ్లను రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు. ఇందులో సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగజ్ నగర్, షాలిమార్, విశాఖపట్నం, హౌరా, గుంటూరు రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని GM అరుణ్ కుమార్ జైన్ సూచించారు.

News September 2, 2024

HYDERABAD COOL..!

image

3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు HYD చల్లబడింది. చిరుజల్లులు, పచ్చదనంతో నగరంలోని కృష్ణకాంత్, వనస్థలిపురం మహవీర్, కేబీఆర్ సహా పలు పార్కులు ఆహ్లాదకరంగా మారాయి. అటు వికారాబాద్ ప్రాంతం కొత్త అందాలతో కనువిందు చేస్తోంది. HYD, RR, MDCL, VKBకి వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు.

News September 2, 2024

HYD: 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలు

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో గచ్చిబౌలి-97, HCU-85.8, మాదాపూర్-68.5, మణికొండ-53.5, కూకట్‌పల్లి-81, ఉప్పల్-51, యూసఫ్ గూడ-69.5, షేక్ పేట-68.3, మోమిన్‌పేట-55.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 2, 2024

HYD: పసి పిల్లలను పొట్టనబెట్టుకుంటున్నారు..!

image

ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పెద్దలు కుటుంబాలను చిదిమేస్తున్న ఘటనలు HYDలో పెరుగుతున్నాయి. జీడిమెట్ల పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో నష్టపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పటాన్‌చెరులోని రుద్రారంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరపెడుతోంది.

News September 2, 2024

HYD: సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు

image

మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

News September 2, 2024

HYD: విద్యుత్ ఫిర్యాదులపై సీఎండీల సమీక్ష

image

విద్యుత్తు వ్యవస్థను పర్యవేక్షించే ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయాన్ని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్ రాస్, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీ డీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదివారం సందర్శించారు. విద్యుత్తు అంతరాయాలపై ఫిర్యాదులు స్వీకరించే 1912 కాల్ సెంటర్ వ్యవస్థను పరిశీలించారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు.

News September 2, 2024

గ్రేటర్‌లో నిధులు నిల్.. కదలని అభివృద్ధి పనులు

image

గ్రేటర్‌లో అత్యవసర పనులు తప్ప కొద్ది నెలలుగా ఇతర అభివృద్ధి జరగట్లేదు. కాలనీ రోడ్లు, నాలాలు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఇలా చాలా పనులు ఆటకెక్కాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. నాలాల పూడికతీత, నిర్మాణ పనులు సవ్యంగా జరగకపోవడంతో వర్షాకాలం ముంపు తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీకి సర్కారు నుంచి వేర్వేరు రూపాల్లో రూ.8వేల కోట్లు రావాలి.

News September 2, 2024

HYD: పిల్లల పట్ల జాగ్రత్త: కలెక్టర్

image

HYD నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో HYD సెప్టెంబర్ 2వ తేదీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రైవేటు, ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షం విజృంభిస్తున్న వేళ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, వాతావరణం మార్పులపై పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.