India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను 5వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.
గ్రేటర్ HYD పరిధిలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుంది. జులై నాటికి ఏకంగా గ్రేటర్ రోడ్ల పై 81.21 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9,103 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా.. వాహనాల పెరుగుదలకు తగ్గట్లు రోడ్ల వ్యవస్థ సరిగ్గా అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీసులు, వికారాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా తీసుకుంటున్న సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
HYD నగరంలో వర్ష బీభత్సానికి పలుచోట్ల పాములు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓల్డ్ సిటీ హసన్ నగర్ ప్రాంతంలో పైతాన్ రాగా.. స్నేక్ క్యాచర్ హకీం షాకిల్ అప్రమత్తమై, పామును పట్టుకున్నారు. పాములు, మొసళ్లు కనిపిస్తే..TFD 18004255364, ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ 8374233366, అనిమల్ వారియర్స్ 9697887888ను సంప్రదించండి.
HYD,RR,MDCL,VKB జిల్లాలలో వర్షం దంచికొట్టింది. 24 గంటల్లో అత్యధికంగా RR జిల్లా కేశంపేటలో 208.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..తలకొండపల్లి-146.5, నందిగామ-137, మేడ్చల్ జిల్లాలో కీసర-105.8, సింగపూర్ టౌన్షిప్-81, HYD జిల్లా యూసఫ్ గూడ-74.8, షేక్ పేట-72.8, VKB జిల్లాలో యలాల్-128.8, కుల్కచర్ల-125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షం దాటికీ లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
HYD జీడిమెట్ల పీఎస్ పరిధి గాజుల రామారంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన దంపతులు వెంకటేశ్(40), వర్షిణి(33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఘటనా స్థలానికి జీడిమెట్ల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటికే 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మూసివెంట అక్రమ నిర్మాణాల కూల్చివేత అంత ఈజీ కాదని, HMDA, GHMC, రెవెన్యూ అధికారులకు కష్టం అవుతుందని భావిస్తున్న యంత్రాంగం, హైడ్రాకు అప్పగించడంపై సమాలోచన చేస్తుంది. మూసి సర్వేలో 12 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెళ్లడైంది. ఇప్పటికే లంగర్‌హౌస్ నుంచి నాగోల్ వరకు సుమారు 5,501 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. కూల్చివేతలో పునరావాసం కోసం బాధితులకు రూ.2,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాల కురిసే అవకాశమున్నందున హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం GHMC కమిషనర్ ఆమ్రపాలి, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల పట్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సేవలకై 040-21111111, 9000113667 నంబర్లలకు సంప్రదించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆద్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు కథలు, నాటికలు వేసే జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారన్నారు.
Sorry, no posts matched your criteria.