RangaReddy

News August 31, 2024

HYD: చెకోడీలు తింటున్నారా..?

image

మూసీ పరివాహక ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆలు చిప్స్, చెకోడీలు, మురుకులు, మిక్చర్, బెల్లం చెక్కీల తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్, అత్తాపూర్, నాగోల్ లాంటి ప్రాంతాల్లో అధికారులు కనీసం తనిఖీలు చేపట్టకపోవడంతో కల్తీ దందా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని జీహెచ్ఎంసీకి పలువురు ఫిర్యాదు చేశారు.

News August 31, 2024

BREAKING: మేడ్చల్ నాదం చెరువు తూము ధ్వంసం చేసిన దుండగులు

image

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని వెంకటాపూర్‌ నాదం చెరువు తూమును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీళ్లు దిగువకు పోటెత్తాయి. నాదం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుపై ఇటీవల పోచారం పీఎస్‌లో కేసు నమోదైంది. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఏఈఈకి ఫిర్యాదు చేశారు.

News August 31, 2024

HYD: GDPలో TOP-3లో మన జిల్లాలే..!

image

తెలంగాణలోని RR, HYD, MDCL జిల్లాలు 2022-23 జీడీపీలో ముందంజలో నిలిచాయి. RR జిల్లా GDP రూ.2,83,419 కోట్లు, HYD- రూ.2,28,623 కోట్లు, మేడ్చల్-రూ.88,867 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో, వికారాబాద్-రూ.19,840 కోట్లతో 21వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే చివరి స్థానంలో ములుగు జిల్లా ఉన్నట్లుగా తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

News August 31, 2024

HYD: అన్ని కలిసోచ్చేలా RRR అలైన్మెంట్ డిజైన్!

image

RRR 189.2 కిలోమీటర్ల దక్షిణ భాగం అలైన్మెంట్ డిజైన్‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఫోర్త్ సిటీ, ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు, బెంగళూరు హైవే లాంటివి దక్షిణ భాగాన ఉన్నందున అన్ని కలిసోచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారులు ఆచితూచి అడుగులు వేస్తూ అలైన్మెంట్ కోసం మూడు డిజైన్లు రూపొందిస్తున్నారు. సుమారు రూ.16 వేల కోట్లతో రోడ్డు నిర్మాణం జరగనుండగా, భూ పరిహారానికే రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.

News August 31, 2024

HYD: ‘బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపట్టొద్దు’

image

బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపడితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని హైకోర్టు శుక్రవారం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల నడెంచెరువు సమీపంలో 17.21 ఎకరాల్లో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను కూల్చే ముందు నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించింది.

News August 31, 2024

HYD: కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు: చేవెళ్ల ఎంపీ

image

BJP సహకారంతో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వలేదని చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఎన్నటికీ BRSతో కలవమని తేల్చి చెప్పారు. గతంలో INC ఎమ్మెల్యేలు కారెక్కారన్నారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు మళ్లీ హస్తం కండువా కప్పుకొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని కొండా ఆరోపించారు

News August 31, 2024

HYD: సహజ వనరుల రక్షణ కోసమే హైడ్రా: మంత్రి

image

చెరువులను కాపాడేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘గృహ’ అనే పర్యావరణ సంస్థ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. నదులు, చెరువులు, వాగులు, అడవులు ప్రతీది మానవాళి మనుగడుకు అవసరమేనని పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోలేక పోతే అది పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని అన్నారు.

News August 31, 2024

‘హైడ్రా OK.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చొద్దు’

image

పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News August 31, 2024

FLASH: హైదరాబాద్‌, రంగారెడ్డికి PINK ALERT⚠️

image

హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

News August 31, 2024

హైదరాబాద్‌లో వర్షం.. జాగ్రత్త!

image

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. రాజధాని రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తడి రోడ్ల మీద వాహనాలను నెమ్మదిగా నడపాలని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
SHARE IT