RangaReddy

News August 30, 2024

అందరికీ ఒకే రూల్.. HYDRA ఆఫీస్ కూల్చేయండి: హరీశ్ రావు

image

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.

News August 30, 2024

ఓపెన్ 10th, ఇంటర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారి కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందే అభ్యర్థులు జిల్లా పరిధి స్టడీ సెంటర్లను సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా కో-ఆర్డినేటర్‌ను ఫోన్ నంబర్ 8008403516లో సంప్రదించాలని కోరారు.

News August 30, 2024

HYD: చనిపోతూ.. ఐదుగురికి LIFE ఇచ్చాడు!

image

చనిపోతూ ఐదుగురికి LIFE ఇచ్చాడు ఓ యువకుడు. MBNR హన్వాడ వాసి చెన్నయ్య(35) ఈ నెల 26న యాక్సిడెంట్‌లో గాయపడగా HYD ఉస్మానియాలో చేర్చారు. వైద్యం అందించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులను ఒప్పించి అతడి కాలేయం, 2 కిడ్నీలు (జీవన్‌దాన్) సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. దీంతో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టాడని జీవన్‌దాన్ ఇన్‌ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.

News August 30, 2024

బాలాపూర్‌ గణేశ్ Aagman-2024

image

హైదరాబాద్ వాసులే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే వినాయకచవితి సమీపిస్తోంది. నవరాత్రులకు మరో వారం రోజులే సమయం ఉండడంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం Aagman-2024‌ను నిర్వహించారు. ధూల్‌పేట నుంచి మధ్యాహ్నం బయల్దేరిన భారీ గణనాథుడు సాయంత్రానికి బాలాపూర్‌‌లోని మండపం‌ వద్దకు చేరుకున్నాడు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

News August 30, 2024

HYD: గణేశ్ మండపాలకు పర్మిషన్.. ఇవి తప్పనిసరి

image

➤HYDలో పర్మిషన్ కోసం ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
➤మీ సేవలో చలాన్ కట్టాలి. (రూ. 145+100)
➤ఐదుగురు ఆర్గనైజర్ల ‘ఆధార్’ అవసరం.
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే అనుమతి పొందవచ్చు.
➤పర్మిషన్ తీసుకుంటే కరెంట్ FREE అని CM రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.
SHARE IT

News August 30, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలి: CM

image

మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరుగాంచిన HYD బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని CM రేవంత్ రెడ్డి అన్నారు. వినాయకచవితి వేడుకలపై సెక్రటేరియట్‌లో ఆయన స‌మీక్ష నిర్వహించారు. ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని CM సూచించారు. పోలీస్ పర్మిషన్ తీసుకునేవారు కరెంట్ కనెక్షన్ కోసం ఎటువంటి డీడీ కట్టనవసరం లేదన్నారు.

SHARE IT

News August 29, 2024

HYD: దుర్గం చెరువులోని 204 భవనాలకు ‘హైడ్రా’ నోటీసులు

image

‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

News August 29, 2024

HYD: విమానం అత్యవసర ల్యాండింగ్.. దక్కని ప్రాణాలు

image

విమానంలో ఓ ప్రయాణికురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సిబ్బంది తెలిపిన వివరాలు.. కేరళకు చెందిన సోషమ్మ(89) బుధవారం కొచ్చి నుంచి ఓ విమాన సర్వీస్‌లో అమెరికాకు బయలుదేదారు. ప్రయాణంలో సోషమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోషమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News August 29, 2024

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించారు. ఉప్పల్ డీఐగా రామలింగారెడ్డిని, పహడీ షరీఫ్ డీఐగా దేవేందర్, మాడ్గుల సీఐగా జగదీష్, ఎల్బీనగర్ సీఐగా వినోద్ కుమార్, తదితరులకు పోస్టింగ్ ఇచ్చారు.

News August 29, 2024

HYD: ఓయూలో రూ.23 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

image

ఓయూలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంబీఏ, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 17 మందికి HDFC బ్యాంక్ కొలువులు ఇచ్చింది. రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య వార్షిక వేతనంతో ఈ నియామకాలు జరిగాయి. MBA కళాశాలలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మంది విద్యార్థుల్లో 109 మందికి వేర్వేరు కంపెనీలు నియామక పత్రాలు అందించనున్నాయి.