RangaReddy

News August 29, 2024

HYD: జీహెచ్ఎంసీలో భారీగా బదిలీలు

image

జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీల ప్రక్రియలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ల నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల వరకు భారీ సంఖ్యలో బదిలీలు చేశారు. బదిలీ అయిన వారిలో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, అడిషనల్ మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. వీరిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి బదిలీ చేశారు.

News August 29, 2024

ఓయూ పీజీ పరీక్షలు 19కి వాయిదా

image

ఓయూ పరిధిలో జరగనున్న పీజీ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు వచ్చేనెల 19కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలను యుజిసి నెట్, టిఎస్ సెట్ పరీక్షల కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

News August 29, 2024

HYD: డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దగ్గర పడుతున్న గడువు!

image

HYDలోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్సిటీలో దూర విద్యలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆగస్టు 31న ఈ గడువు పూర్తి కానుంది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, కోర్సులు ఉన్నట్లు ప్రొఫెసర్ కోటేశ్వరరావులు, డా.వీరన్న తెలిపారు.

News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

News August 29, 2024

రాష్ట్రంలోనే HYD జిల్లాలో అత్యధిక MSME యూనిట్లు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా HYD జిల్లాలో MSME యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 1,68,077 MSMEలు ఉంటే.. ఇందులో 1,33,937 యూనిట్లు సర్వీస్ విభాగంలో ఉన్నాయి. మిగతా 34,140 యూనిట్లు ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. ఇందులో సూక్ష్మ సంస్థలు అత్యధికంగా 1,56,642 యూనిట్లు పనిచేస్తున్నాయి. చిన్న తరహావి 9,813, మధ్య తరహావి 1,622 దాకా ఉన్నాయని అధికారులు తెలిపారు.

News August 28, 2024

HYD: మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఖరారు!

image

మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు NOC పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ HYD పరిధిలో మూసీకి ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు LOCల కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. బఫర్ జోన్ నిర్ణయంతో.. మూసికి 50 మీటర్ల సరిహద్దు వరకు నిర్మించిన అక్రమ నిర్మాణాలను త్వరలో కూల్చివేయనున్నారు.

News August 28, 2024

RR జిల్లాలో లక్షకు పైగా MSME యూనిట్లు

image

లక్షకు పైగా MSMEలు ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది.ఇక్కడ 1,09,164 యూనిట్లు ఉండగా.. అందులో 87,376 సేవా రంగానికి చెందినవే.మిగిలిన 21,788 ఉత్పత్తి రంగంలో పనిచేస్తు న్నాయి.సూక్ష్మ సంస్థల సంఖ్యనే 1,04,846గా ఉంది. రూ.కోటిలోపు పెట్టుబడి, రూ.5 కోట్లలోపు టర్నోవర్ కల్గిన వాటిని సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు.జూన్ 2024 వరకు ఉన్న వివరాల ప్రకారం చిన్న తరహా 3,866 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News August 28, 2024

HYD: 20 పార్కుల ఏర్పాటుకు HMDA ప్రణాళిక

image

HYD నగర శివారులో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు 20 పార్కులకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కొత్వాల్ గూడలో 105 ఎకరాల్లో పురోగతిలో ఉండగా, ఇక శంషాబాద్, తెల్లాపూర్, గాజులరామారం లోనూ ఏర్పాటు చేయనున్నారు. ఆయా పార్కులలో సకల వసతులు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పిల్లలకు ఆట సామాగ్రితో పాటు, ఇతరత్ర అందుబాటులో ఉంచనున్నారు.

News August 28, 2024

HYD: కరెంట్ షాక్ తగిలి చనిపోతే..?

image

గ్రేటర్ HYD పరిధిలో వర్షాకాలం వేళ కరెంట్ స్తంభాలు, తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు..
✓విద్యుదాఘాతంతో మృతిచెందిన కుటుంబానికి పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు ✓శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.5 లక్షలు
✓తీవ్రంగా గాయ పడితే రూ.లక్ష, స్వల్పంగా గాయపడితే రూ. 25 వేలు చెల్లిస్తారు
✓ప్రమాద బాధితులకు వైద్య ఖర్చులు కూడా అందిస్తారు. ✓ఆస్తినష్టం జరిగినా పరిహారం చెల్లిస్తారు.

News August 28, 2024

KTR చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్

image

బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. గోషామహల్‌లోని తన కార్యాలయంలో మాట్లాడారు. బండి సంజయ్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని రాజాసింగ్ ప్రశ్నించారు. కవితకు బెయిల్ ఇవ్వాలని వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో BRS విలీనం కావడం తథ్యం అని రాజాసింగ్ పేర్కొన్నారు.