India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రోరైళ్లు నడిపిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడిపిస్తామని వెల్లడించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రోరైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
యువతులు, మహిళలను మగవారు ఏ విధంగా చూస్తున్నారన్న అంశంపై ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు బొమ్మలతో ప్రయోగాలు చేశారు. కుర్తాలు, చీరలను ఉపయోగించి కొన్ని బొమ్మలు, జీన్స్, షర్టులతో మరికొన్ని బొమ్మలను వేలమందికి పంపిణీ చేశారు. ముఖ కవళికలను తెలుసుకునేందుకే ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. అయితే, ఎక్కువ మంది యువకులు అనుచితంగా లైంగిక శరీర భాగాలను చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడైంది.
BRS నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని రంగారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు KCR పాలన చూసి విసుగు చెంది BRSను ఓడించి, తమను గెలిపించారని మంగళవారం HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. రుణమాఫీపై అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టడం మానుకోకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు.
28-08-2000 రోజు HYD ఉలిక్కిపడింది. విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరగానే పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చనిపోయారు. నేడు ఆ అమరులకు కామ్రేడ్‌లు నివాళి అర్పిస్తున్నారు.
OYOకు వస్తున్న యువతను టార్గెట్ చేసిన ఓ లాడ్జి ఓనర్ భాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. హైదరాబాద్ శివారు శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. పోలీసుల వివరాలు.. ఒంగోలు వాసి గణేశ్ ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్‌రూంలోని బల్బ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేశాడు. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు రైడ్స్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
వినాయకచవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఈ మేరకు https://policeportal.tspolice.gov.in/indxNew1.htm?ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్గనైజర్లు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. అనంతరం సంబంధిత పీఎస్‌లో సంప్రదిస్తే పర్మిషన్ ఇచ్చేస్తారు. విగ్రహం ఎత్తు, రూట్ మ్యాప్ తదితర వివరాలను పొందుపర్చండి. ఇప్పుడే అప్లై చేసుకోండి.
సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. డెంగ్యూ వ్యాధి కట్టడిపై రాష్ట్రస్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిని ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమేనని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బోరబండ, మధురానగర్ పీఎస్‌లలో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సీపీ స్పందించారు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా వీటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ఫిర్యాదులపై విచారణ కొనసాగించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు జాగ్రత్తగా పని చేయాలన్నారు.
HYDలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం SRDP ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 42 ప్రాజెక్టులను ప్రారంభించి, 36 విజయవంతంగా పూర్తి చేసింది. మిగిలిన ప్రాజెక్టులను 2024లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని పూర్తి చేయండి’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.
HYDలో ‘డెంగ్యూ’ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 404 కాలనీల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 నుంచి 15 వరకు 10 రోజుల్లో GHMC, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. 731 మందికి డెంగ్యూ, ఒకరికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే, 378 మందికి మాత్రమే డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బల్దియా లెక్కలు చెప్పడం గమనార్హం. పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీ కేర్ ఫుల్
SHARE IT
Sorry, no posts matched your criteria.