India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
UPSC ప్రిలిమ్స్ పరీక్షలో TG రాష్ట్రంలోనే గరిష్ఠంగా RR నుంచి 14 మంది, మేడ్చల్ నుంచి 11, HYD నుంచి ముగ్గురు, వికారాబాద్ నుంచి ఒకరు, మొత్తంగా 29 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన ఒక్కొకరికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రూ.లక్ష విలువ చేసే చెక్కులను అందజేశారు. మెయిన్స్ పరీక్షలో పాసై ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో రూ.లక్ష అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
HYD నగర ఆసుపత్రుల్లో ఫేక్ బిల్స్ వేసి CMRF స్కాంకు పాల్పడినట్లు CID పోలీసులు FIR నమోదు చేశారు. కేసు నమోదు చేసిన ఆసుపత్రులు లిస్టులో ఐఎస్ సదన్ అరుణశ్రీ హాస్పిటల్, సైదాబాద్ శ్రీకృష్ణ, మీర్‌పేట్ హిరణ్య, హస్తినాపురం డెల్టా, బి.యన్ రెడ్డి నగర్ శ్రీరక్ష, సాగర్‌రింగ్ రోడ్డు MMS, కొత్తపేట MMV ఇంద్రా మల్టీ స్పెషాలిటీ, బైరామల్‌గూడ శ్రీ సాయి తిరుమల, శారదానగర్ ADRM ఆస్పత్రులు ఉన్నట్లుగా తెలిపారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానుడి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.
ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరసనకు పిలుపునిచ్చింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఉద్యోగులను కోరింది. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌లతో నిరసన వ్యక్తం చేస్తామని జేఏసీ తెలిపింది.
HYD మహానగరంలో HYDRA దూకుడు పై సోషల్ మీడియా వేదికగా AI ఉపయోగించి రూపొందించిన పలు చిత్రాలు వైరల్ అవుతున్నాయి. HYDRA అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోందని, మా ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వెంటనే చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి, ఇతర శాఖల అధికారులకు కోకొల్లలుగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులోనే భవన నిర్మాణాలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయని పలువురు ఆరోపించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఔటర్ రింగురోడ్డు వరకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓఆర్ఆర్ పరిధిలోని 28 గ్రామాలతో పాటు, ఆర్ఆర్ జిల్లాలోని పలు గ్రామాలు జిహెచ్ఎంసి పరిధిలోకి వెళ్లనున్నాయి. ORR బయట ఉన్న గ్రామాలతో నూతన మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర స్పీకర్, VKB అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ (X) హ్యాండిల్ హాక్ అయింది. దీనిపై స్పీకర్ స్పందిస్తూ..మీకు ఎలాంటి సందేశాలు వచ్చినా, వ్యంగ్యమైన పోస్టులు షేర్ చేసినా మీరు ఎవ్వరు పట్టించుకోకండి.
నేను నా X టెక్నికల్ టీంతో మాట్లాడి తిరిగి అకౌంట్ రికవరీ చేయించాను. ఇకపై యథావిధిగా ఎక్స్ అకౌంట్లో మా అప్డేట్స్ చూడగలరు అని స్పీకర్ అన్నారు.
తండ్రి ముందే కూతురు మృతి చెందిన విషాదఘటన హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరుకు చెందిన SPF SI శంకర్ రావు తన కుతూరిని బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వారి బైక్ ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.