RangaReddy

News August 26, 2024

HYD: ప్రతీ స్కూల్ నుంచి 5మందికి గొప్ప అవకాశం

image

HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్‌స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 26, 2024

HYDలో ఉదయం నుంచే ట్రాఫిక్ ALERT

image

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా HYDలో నేడు ఉ.4 నుంచి రా.11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. గన్ ఫౌండ్రీ ➥ తిలక్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి స్టేషన్ వైపు వెళ్లకుండా GPO జంక్షన్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు. MJ మార్కెట్ నుంచి GPO జంక్షన్ వెళ్లకుండా నాంపల్లి వైపు డైవర్ట్ చేస్తారు. నాంపల్లి నుంచి కోఠి➥ ట్రూప్ బజార్➥ బ్యాంక్ గల్లికి డైవర్ట్ చేస్తారు. BJP ఆఫీస్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

News August 25, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తాం:సీఎం
✓VKB: చాకచక్యంగా రైలు ప్రమాదాన్ని తప్పించుకున్న మహిళ
✓HYD నగరానికి 74KM దూరంలో చారిత్రాత్మక కొండాపూర్
✓గుడిమల్కాపూర్: లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి
✓గచ్చిబౌలి: అమ్మాయిలను రేప్ చేసిన ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
✓డెంగ్యూ కేసుల పై హరీష్ రావు ఆందోళన
✓ఉప్పల్: 2.20 కిలోల గంజాయి సీజ్

News August 25, 2024

HYD నగరానికి పూర్వవైభవం తీసుకొస్తాం: సీఎం

image

జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు.

News August 25, 2024

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ అసదుద్దీన్ భేటీ

image

సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ ఖలీద్ సైపుల్ల రెహమాని, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హకీం ఖురేషి, పాల్గొన్నారు.

News August 25, 2024

HYD: భరోసా సెంటర్లతో చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం: DG

image

HYD నగరంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న దివ్యాంగులు, చిన్నారి బాధితులకు సంబంధించి జరిగిన స్టేట్ లెవెల్ సమావేశంలో CID డైరెక్టర్ షికాగోయల్ పాల్గొన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్లలో భరోసా సెంటర్ల ఏర్పాటు ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడి, మంచి ప్రభావం చూపినట్లుగా పేర్కొన్నారు. భద్రత పై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే పరిస్థితి ఉండదన్నారు.

News August 25, 2024

రంగారెడ్డి: ROR 2024 చట్టం బిల్లుపై అవగాహన

image

ROR  చట్టం రూపకల్పనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు శనివారం కలక్టరేట్‌లో ప్రస్తుత 2020 ROR చట్టంతో కలిగే ఇబ్బందులను తొలగించి, రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ROR  2024 చట్టం బిల్లుపై అవగాహన, అభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, అదనపుకలెక్టర్ ప్రతిమాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

News August 25, 2024

HYD: వినాయకచవితికి పటిష్ట చర్యలు: సీపీ

image

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూడు కమిషనరేట్స్ పరిధిలోని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ్ సమితి, ఖైరతాబాద్ ఉత్సవ్ సమితి, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు

News August 25, 2024

HYD: 75 ఏళ్ల వయసులో దేశభక్తి చాటుతూ.. బైక్‌ రైడ్‌

image

ఈయన పేరు శివన్‌కుట్టి.. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులోనూ సాహసోపేత బైక్‌ రైడ్‌ చేపట్టి ఈ తరం యువతకు తానేం తక్కువ కాదని నిరూపించారు. హైదరాబాద్‌ టూ లడఖ్‌.. లడఖ్‌ టూ కన్యాకుమారి, హైదరాబాద్‌ ఇలా సోలో బైక్‌ రైడ్‌తో దేశభక్తి చాటుతూ.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ ఏడాది మే 26న నా యాత్ర ప్రారంభమై.. జూలై 20న ముగిసింది. 55 రోజుల్లో 8,826 కిలోమీటర్ల మేర యాత్ర చేశారు.

News August 25, 2024

HYD: ‘క్యూలైన్ తిప్పలు వద్దు..UTS యాప్ ముద్దు’

image

HYD, RR, MDCL,VKB జిల్లాలో ఉంటున్న ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ‘క్యూలైన్ తిప్పలు వద్దు.. UTS యాప్ ముద్దు’ అని తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్లలో వందల సంఖ్యలో ప్రయాణికులు క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా UTS మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.