India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
VKB జిల్లాలో కల్తీకల్లు తాగి ఒకరు మృతి చెందారని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో ఉన్న 60 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రసాయన కల్లుకు బానిసయ్యారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రసాయన కల్తీ కల్లు దుకాణాలను మూసేయాలన్నారు.
✓జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది:జానీ
✓HYD:ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ దానం అంతంతే!
✓తార్నాక: ఆర్టీసీ బాధితులకు రూ.1.15 కోట్ల చెక్కు
✓HYD: ట్రాఫిక్ ఉల్లంఘన పై 28% పెరిగిన జరిమాణాలు
✓డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడ్డ వారికి 2 రోజులు ట్రాఫిక్ డ్యూటీ
✓జగద్గిరిగుట్ట: నవ వధువు మనిషా ఆత్మహత్య
✓ఉప్పల్: మూడో ఫ్లోర్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై రైల్వే సహాయక మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు మీడియాతో మాట్లాడారు. పునరాభివృద్ధి అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే, 40 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. రాబోయే 40 ఏళ్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని అంచనా వేసి, డిజైన్ చేసి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో GM అరుణ్ కుమార్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ షాక్‌తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబ సభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్‌లింగంపల్లిలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగద్గిరిగుట్ట PSపరిధి రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యువతి మనీషాను ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్య సమాజ్‌లో యువకుడు శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో శేఖర్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులతో ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
HYDలో సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, నో పార్కింగ్, అర్హత లేకుండా డ్రైవింగ్ లాంటివి చేసిన వారిపై గత సంవత్సరం 14.2 లక్షల మంది పై మాత్రమే కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది మే వరకు 18.15 లక్షల మంది పై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 28% జరిమానాలు పెరిగినట్లు పేర్కొన్నారు. రోడ్లపై డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని ప్రజలు tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు, సూచనలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా చేయొచ్చని HYD, CYB పోలీస్ అధికారులు తెలిపారు. FIR సైతం డైరెక్ట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజా భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నట్లుగా పోలీసు యంత్రాంగం తెలిపింది.
HYD ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే అంతంత మాత్రమే జరుగుతుంది. 2013నుంచి ఇప్పటివరకు సుమారు నిమ్స్ ఆసుపత్రిలో 32, గాంధీలో ఒకటి, ఉస్మానియాలో 9 అవయవ మార్పిడి పరీక్షలు జరిగాయి. అదే.. యశోదలో 486, కిమ్స్‌లో 275 అవయవ మార్పిడిలు జరగడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులు ఉన్నప్పటికీ, అత్యాధునిక థియేటర్లు, పూర్తి వసతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత ఇతర సదుపాయాల కల్పనకు TBOCWWB ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ గంగాధర్ అన్నారు. HYD ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఆవరణలో TBOCWWB ఆధ్వర్యంలో రాష్ట్రంలో సహాయ కార్మిక శాఖ అధికారులకు బయోమెట్రిక్, ఐరిష్ పరికరాలను పంపిణీ చేశారు.
Sorry, no posts matched your criteria.