RangaReddy

News August 24, 2024

HYD: ప్రజావాణికి 1150 అర్జీలు

image

బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1150 అర్జీలు అందాయి. ఎస్సీ సంక్షేమం-610, విద్యుత్ శాఖ, సింగరేణి-115, పౌరసరఫరాల శాఖ-113, మైనారిటీ సంక్షేమం-85, రెవెన్యూ-69, ఇతర శాఖలకు 158 వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రత్యేక అధికారిణి దివ్య అర్జీలు స్వీకరించారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

News August 24, 2024

HYD: అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జ్ ప్రొ. సుధారాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 చివరి తేదీ అని వెల్లడించారు. వివరాలకు మొబైల్: 7382929570 580, 040-23680222/333/444/555, 18005 990101 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. SHARE IT

News August 24, 2024

HYD: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ ఉపసంచాలకులు టీ.గోపాలకృష్ణ గచ్చిబౌలిలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 18న ఉంటుందన్నారు.

News August 24, 2024

HYD: హైవేలపై నడక మార్గాలను పెంచాలి: మంత్రి పొన్నం

image

జాతీయ రహదారులపై రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల నడక మార్గాల సంఖ్యను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై శుక్రవారం హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

News August 24, 2024

HYD: టీచర్‌గా మారిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

image

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కొద్దిసేపు టీచర్‌గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్కడి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నైపుణ్యాలను గవర్నర్‌ స్వయంగా పరీక్షించారు. దృఢసంకల్పంతో తమ కలలను సాకారం చేసుకోవాలని, సమాజంపై బాధ్యతను పెంచుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.

News August 24, 2024

HYD: కొత్త రేషన్ కార్డులకు 2.8 లక్షల దరఖాస్తులు

image

కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత కార్డుదారుల్లో మరణించినవారి వివరాలను తొలగించి.. కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో సర్కిల్‌లో సుమారు 20 వేల వరకు కొత్త పేర్ల నమోదుకు సంబంధించి అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం HYDలో 2.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను గుర్తించనున్నారు.

News August 24, 2024

HYD: 20 మంది మాయగాళ్లు.. 900 కేసులు

image

పార్ట్ టైం జాబ్స్, షేర్ మార్కెట్, ఫెడెక్స్ కొరియర్‌తో బెదిరింపులు.. ఇలా గుజరాత్ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. తరచూ చిరునామా మార్చుతూ పోలీసులను ఏమార్చటం వీరి ప్రత్యేకత. సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గుజరాత్‌లో మకాం వేసి నేరస్థులను గుర్తించారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై మన రాష్ట్రంలోనే 100కు పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది.

News August 24, 2024

HYD: చెత్త తొలగింపులో జీహెచ్ఎంసీ జాప్యం

image

నగరంలో చెత్త సేకరణ రోజురోజుకూ మందగిస్తోంది. 20 లక్షల ఇళ్ల నుంచి ఉత్పత్తయ్యే చెత్తను సేకరించడానికి బల్దియా 4,500 స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసిన, సరిగా చెత్త క్లియర్ చేయడం లేదు. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ సీజన్‌లో 1800 మంది డెంగ్యూ, 2220 మంది మలేరియాతో చికిత్స పొందుతున్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ రూ.10 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకుండా పోతోంది.

News August 24, 2024

పాతబస్తీ మెట్రో కోసం 1200 ఆస్తుల సేకరణ

image

పాతబస్తీ మార్గంలో మెట్రోరైలు కోసం రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జారీ చేశారు. సేకరించాల్సిన ఆస్తులను గుర్తించగానే విడతలవారీగా ప్రకటనలు ఇస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గంలో మెట్రో కోసం 1200 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని హెచ్ఎఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 8 నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.

News August 24, 2024

సికింద్రాబాద్: ‘మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు’

image

మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.