RangaReddy

News August 23, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✓విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలి:రామకృష్ణ
✓KPHB: యూట్యూబర్ వంశీ అరెస్ట్
✓బాచుపల్లి: రూ.4 లక్షలు.. చెల్లించినందుకు శివశంకర్ రెడ్డి అరెస్ట్
✓ఉప్పల్ ప్రాంతానికి మరో రూ.6 కోట్లు
✓తార్నాక: ఉద్యమకారులకు సహకారం ఉంటుంది: కోదండరాం
✓కొండారెడ్డిపల్లి ఘటనపై డీజీపీకి మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
✓రాచకొండ: 15 రోజుల్లో 122 మంది పోకిరీలు చిక్కారు.

News August 23, 2024

HYD: ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్యం విషమం

image

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ పోరాటంలో ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారి మిత్రులు తెలిపారు.

News August 23, 2024

HYD: ఉద్యమకారులకు ప్రభుత్వ సహకారం ఉంటుంది: కోదండ రామ్

image

తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి నేతృత్వంలో శుక్రవారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌ను తార్నాకలో కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు.

News August 23, 2024

HYD: రేపు తెలుగు సంక్షేమ భవన్ ముట్టడి: వేముల రామకృష్ణ

image

విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24వ తేదీన శనివారం వందలాది మంది విద్యార్థులతో మాసబ్ ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. శుక్రవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరవుతారన్నారు.

News August 23, 2024

HYD: యూట్యూబర్ వంశీ కుమార్ ARREST

image

కూకట్‌పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై డబ్బులు విసిరి న్యూసెన్స్ క్రియేట్ చేసిన వంశీ కుమార్ (24) అనే యువకుడిని ఈరోజు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు వెదజల్లే వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు కూకట్‌పల్లి సీఐ ముత్తు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేస్తే సహించబోమని హెచ్చరించారు.

News August 23, 2024

HYD: రూ.4 లక్షలు ఇవ్వనందుకు కిడ్నాప్ చేశారు..!

image

వీసా మంజూరు కోసం చెల్లించిన రూ.4 లక్షలను తిరిగి చెల్లించనందుకు ఇటీవల శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఆరుగురు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో మెడిసిన్ చదువు కోసం SS కన్సల్టెన్సీ యజమాని శివశంకర్ రెడ్డికి రూ.4 లక్షలను బాధితులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. అవి తిరిగి ఇవ్వకపోవడంతో అతడిని కిడ్నాప్ చేశారని, నేడు వారిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేసి PSకి తరలించారు.

News August 23, 2024

HYD: ‘బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేశారు. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని ప్రధాన డిమాండ్‌తో, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల, సంయుక్త సమావేశం నిర్వహించారు.

News August 23, 2024

HYD: ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: మాజీ ఉప రాష్ట్రపతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా HYDలోని శాసనసభ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుష్పాంజలి ఘటించారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఆంగ్లేయ సాయుధ బలగాలకు గుండెలు చూపిస్తూ ధైర్యం ఉంటే కాల్చుకోండి అని సింహంలా గర్జించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

News August 23, 2024

HYD: PPP పద్ధతిలో మెట్రో కట్టడం అసాధ్యం: MD

image

అభ్యుదయ కవి, తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ 70వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు యూనివర్సిటీలో జరిగిన సభలో HYD మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రసంగించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టు కట్టడం అసాధ్యం అన్నట్లుగా HMRL అధికారులు X వేదికగా తెలియజేశారు.

News August 23, 2024

BREAKING: HYD: ఏసీబీ వలకు చిక్కిన మరో అధికారిణి..!

image

HYDలో ACB ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. నేడు నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.