India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మరోసారి మెట్రో డీలక్స్ నెలవారి బస్సు పాసు ప్రవేశపెట్టినట్లు గ్రేటర్ RTC ఈడీ వెంకటేశ్వర్లు ఈరోజు తెలిపారు. రూ.1450 చెల్లించి మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్(నాన్ఏసీ), ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. రూ.5000తో పుష్పక్ ఏసీ,రూ.1900తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ,రూ.1300తో మెట్రో ఎక్స్‌ప్రెస్, రూ.1150తో సిటీ ఆర్డినరీ బస్ పాసులు ఉంటాయన్నారు.
సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై వాస్తవ పరిస్థితి ఏంటనే విషయమై తెలుసుకునేందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయరెడ్డి వెళ్లగా వారిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఛార్జ్ తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద ఈరోజు HYD నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. జరిగిన విషయాన్ని తనకు తెలియజేయాలని లేఖ ద్వారా కోరారు.
HYDలోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ఈరోజు మహిళా జర్నలిస్టులు సరిత, విజయరెడ్డి కలిశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడిగేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వారు ఈ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని HYD బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోత్కుపల్లి, MLAలు అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు.
HYD నగరంలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు GHMC రోడ్ల పరిసరాల్లో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. PVNR పిల్లర్ నంబర్-264, నేతాజీ నగర్, రంగ మహల్ జంక్షన్, సోమాజిగూడ ఇమేజ్ ఆసుపత్రి, సోమాజిగూడ జోయ్ ఆలుకాస్, రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకపూల్ ద్వారక హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, అయ్యప్ప సోసైటీ చెక్ పోస్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఓల్డ్ కేసీపీ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.
బాలాపూర్‌లో బీటెక్ స్టూడెంట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పక్కా ప్లాన్ చేసి మరీ ప్రశాంత్‌ని హత్య చేసినట్లు గుర్తించారు. హంతకులు అంతా ఒకే బస్తీకి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన సీసీ ఫుటేజ్ ద్వారా మూడు గంటల్లో నిందితులకు చెక్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
కరోనా కష్టకాలంలో రోగులకు సేవలందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. గురువారం ఢిల్లీ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్-19 రిపోర్టు రిలీజ్ అండ్ డిస్సెమినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ త్రిలోక్ చందర్‌ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.
విపత్తుల సమయంలో బాధితులకు సాయం అందించడం సవాళ్లతో కూడుకున్న పని, చాలాసార్లు హెలికాప్టర్ వెళ్లలేని ప్రాంతాలు సైతం ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 100 కిలోల బరువును అవలీలగా తరలించే ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన భూమికి సంబంధించి ధరణి సమస్య పరిష్కారం కాకపోవడంతో తలకిందులుగా నిరసన చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడు చేసిన పనికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యాలయ అధికారులు అవాక్కయ్యారు.
Sorry, no posts matched your criteria.