India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీపై కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నేతల ధర్నాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
నగరంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం కేజీ చికెన్ రూ. 160(స్కిన్‌లెస్) చొప్పున విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గురువారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 187, స్కిన్‌లెస్ ధర రూ. 213, ఫాంరేటు రూ. 107, రిటైల్ రూ. 129గా ఉంది. శ్రావణ మాసం తొలివారానికి, ఈ రోజు పోల్చితే కేజీకి ఏకంగా రూ. 40 పెరగడం గమనార్హం.SHARE IT
గణేశ్ ఉత్సవాలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై అధికారులతో రాచకొండ సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు మండపాల నిర్వాహకులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు. మండపాల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.
SHARE IT
HYD నగరంలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి ఏటా కొత్తగా సుమారు 15,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఏటా మేజర్ సర్జరీలు 4,500, మైనర్ సర్జరీలు 6,000, రేడియేషన్ థెరపీలు దాదాపు 300 మందికి జరుగుతున్నాయి. కీమోథెరపీ చికిత్సలు సైతం 300 మందికి జరుగుతున్నట్లు తెలిపారు. దాదాపుగా 1.5 లక్షల మందికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 1,751, మేడ్చల్-399, రంగారెడ్డి-310 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గాంధీ, ఉస్మానియా, ఏరియా ఆసుపత్రుల్లో జ్వర లక్షణాలతో వస్తున్న పేషెంట్లు కిక్కిరిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోని, దోమతెరలు వాడాలన్నారు.
దోస్త్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో గ్రూపు మారేందుకు ఇంట్రా కాలేజ్ రెండో విడతను చేపడుతున్నామని, ఈనెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. గ్రూపు మారేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 24న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
నగరం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నార్సింగిలో హరే కృష్ణ మూమెంట్ సంస్థ ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో భారీ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న అనంతశేష స్థాపన ద్వారా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. హరేకృష్ణ మూమెంట్ ఛైర్మన్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ మధు పండిట్ దాస్ ప్రభూజీ తదితరులు హాజరుకానున్నారు.
KTR రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తీసేస్తాం అంటారా? మీరు తీసేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండాలని లోపల ప్రతిష్ఠిస్తున్నాం. BRS ఎప్పటికీ గెలవదు. మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే’ అని అన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. HYD ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ సదస్సు 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు హాజరై మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 23న కోకాపేటకు వస్తున్నారని హరేరామ హరేకృష్ణ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కోకాపేట హరేరామ హరేకృష్ణ స్థలం ప్రాంగణంలో 430 అడుగుల ఎత్తుతో శ్రీకృష్ణ ఆలయం(హరేకృష్ణ హెరిటేజ్ టవర్) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేషస్థాపన పూజా కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు.
Sorry, no posts matched your criteria.