India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న 5 రోజులు HYDలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం భారీ వర్షాల ప్రభావంపై రెవెన్యూ, విద్య, వైద్య, అగ్ని, పోలీసు శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.
HYD నగరం నుంచి కటక్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. HYD నుంచి కటక్‌కు ప్రతి మంగళవారం (ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ట్రైన్ ఉంటుంది. కటక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రతి బుధవారం (ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 18 వరకు) సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
రానున్న వినాయకచవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్ అన్నారు. గణేశ్ మండప నిర్వాహకులతో మంగళవారం హర్యానాభవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. తప్పనిసరిగా పోలీసు నిబంధనలు పాటించాలన్నారు. అందుకు వినాయక మండప నిర్వాహకులు తమకు సహకరించాలన్నారు. సీసీ కెమెరాలు మండపంలో ఏర్పాటు చేసుకోవాలని, పోలీసుల అనుమతితోనే మండపాలు పెట్టుకోవాలన్నారు. సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. SHARE IT
SC వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆనందదాయకమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సనత్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనా విధానం అమలయ్యేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని, వయసులో నేను పెద్దవాడిని అయిన సీఎంకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా అన్నారు.
కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన యడవల్లి వెంకటస్వామిని AICC నియమించడంపై తెలంగాణ విద్యార్థి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖాస్త్రాలు సంధించారు. వెంకటస్వామిని తొలగించాలని, తెలంగాణ వ్యక్తికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని డిమండ్ చేశారు.
రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయమని పలువురు కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, శ్రీధర్, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి, తిగుళ్ల కృష్ణమూర్తి, ఏలె లక్ష్మణ్ తదితరులు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
బోరబండలో న్యాయవాది సంతోష్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.
ఓపీ చీటి కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద లైన్‌లో గంటలకొద్ది నిలబడతాం. ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో 2 నిమిషాల్లోనే ఓపీ చీటి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ రాజేంద్రనాధ్ అన్నారు. ‘అభా’ యాప్‌తో క్యూలైన్ కష్టాలు తీరనున్నాయి. ఓపీ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభా యాప్‌లో వివరాలు నమోదు చేస్తే ఓపీ చీటీ వస్తుంది. దీన్ని డాక్టర్లకు చూపించి సేవలు పొందొచ్చు.
జేఎన్టీయూహెచ్‌లో ఈ ఏడాది(2024-25) నుంచే బీ-ఫార్మసీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ఫార్మసీ విభాగం హెచ్వోడీ డాక్టర్ ఎస్.శోభారాణి తెలిపారు. ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయని.. ఇప్పటికే వీటి భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ అధికారులకు వివరాలు పంపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎం-ఫార్మసీలో 4 కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో కోర్సులో 15సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంతో వయోజనులు, గృహిణులు కనీస విద్యార్హతలైన పదో తరగతి, ఇంటర్ సాధించేందుకు ఈ విధానం ఎంతో సహకరిస్తుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అంతర్జాల కేంద్రాల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా ప్రవేశాలను నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 10వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.