RangaReddy

News April 23, 2025

HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్

image

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ ల‌భించింది. TMRJC ఖైర‌తాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కుల‌కు గాను 495 మార్కులు వ‌చ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 23, 2025

సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

image

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు. 

News April 23, 2025

హయత్‌నగర్: హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

image

రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్ల వెంట ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మెట్ తహశీల్దార్‌కు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా, వచ్చి పోయేవారికి, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 23, 2025

HYD: ‘డ్రగ్స్‌కు నో… భవిష్యత్తుకు అవును చెప్పండి’

image

రాచకొండ CPసుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు మత్తుపదార్థాల విపత్తుపై యువతలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ‘మీరు ముగించడానికి పుట్టలేదు…ప్రారంభించేందుకు పుట్టారు’ అనే శక్తివంతమైన సందేశంతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.”డ్రగ్స్‌కు నో చెప్పండి…మీ భవిష్యత్తుకు అవును చెప్పండి” నినాదంతో యువతలో మార్పు తీసుకురావాలని పోలీసులు ఆకాంక్షించారు.

News April 23, 2025

HYD: OUలో వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజుకు అవకాశం

image

OU పరిధిలోని డిగ్రీ కోర్సులకు వన్ టైమ్ ఛాన్స్ పరీక్షా ఫీజులు స్వీకరిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫీజును వచ్చే నెల 19 వరకు చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in ను చూడాలన్నారు.

News April 22, 2025

బీఆర్ఎస్ సభకు ప్రత్యేక ఏర్పాట్లు: జైపాల్ యాదవ్

image

వరంగల్లో బీఆర్ఎస్ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లేందుకు 35 బస్సులు, 300 బైకులు ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. మంగళవారం కడ్తాల్ లో పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. సభకు తరలి వెళ్లే ముందు ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News April 22, 2025

సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

image

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌‌‌కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.

News April 22, 2025

HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

image

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్‌ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్‌ 67.74 స్టేట్ 23వ ర్యాంక్

News April 22, 2025

రంగారెడ్డి: రైతు బిడ్డకు ఇంటర్‌లో TOP RANK

image

రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతుబిడ్డ తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌లో టాపర్‌గా నిలిచింది. ఇబ్రహీంపట్నం మం. పోచారానికి చెందిన నగేశ్ గౌడ్-సబిత దంపతుల కూతురు శ్రీవార్షిక MPCలో 470 మార్కులకు 468 మార్కులు సాధించింది. ఇంగ్లిష్, సంస్కృతంలోనే ఒక్కో మార్కు రాలేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలంగాణ స్టేట్ టాప్ ర్యాంకర్‌గా రైతు బిడ్డ నిలవడం గర్వకారణం.
SHARE IT

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా హవా

image

ఇంటర్ ఫలితాల్లో మన రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. ఫస్టియర్‌లో 76.36 శాతంతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొత్తం 80,412 మంది పరీక్ష రాశారు. ఇందులో 61,406 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లోనూ విద్యార్థుల హవా కొనసాగింది. 70,581 మంది పరీక్ష రాయగా.. 54,721 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 77.53 శాతంతో రంగారెడ్డి జిల్లా 4వ స్థానంలో నిలిచింది.