RangaReddy

News June 8, 2024

HYD: జయశ్రీ మృతి.. ప్రమాదవశాత్తా.. ఆత్మహత్యా..?

image

HYD పటాన్‌చెరు పరిధి <<13398885>>అమీన్‌‌పూర్ లేక్‌లో పడి<<>> మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. సాయిరాం హిల్స్‌లో ఉంటున్న జయశ్రీ(25), రవిజేత దంపతులు.. గొడవల కారణంగా JANలో విడాకులకు అప్లై చేశారు. దీంతో ఆమె పిఠాపురంలోని పుట్టింటికి వెళ్లింది. గత నెల 26న రవి తండ్రి మృతిచెందడంతో ఆమె తిరిగొచ్చింది. శుక్రవారం భర్త, కూతురి(4)తో కలిసి వెళ్లిన ఆమె చెరువులో పడి చనిపోయింది. మిస్టరీ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 8, 2024

HYD: రామోజీరావు మరణంపై మధుయాష్కి గౌడ్ సంతాపం

image

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణంపై టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, HYD ఎల్బీనగర్ నియోజకవర్గ నేత మధుయాష్కి గౌడ్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పత్రికా, మీడియా రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, జర్నలిజంలో నూతన ఒరవడికి బాటలు వేసి.. అందరూ అనుసరించేలా మార్గదర్శి అయ్యారని తెలిపారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

News June 8, 2024

HYD: రామోజీరావు మృతిపై మంత్రి పొన్నం సంతాపం

image

ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీరావు గర్వకారణంగా నిలిచారని గుర్తు చేశారు. రామోజీ రావు జీవితం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి అని అన్నారు.

News June 8, 2024

HYD: ‘ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు సజావుగా నిర్వహించాలి’

image

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇస్తూ గత సంవత్సరం మల్టీ జోన్-1లో బదిలీ పొంది పలువురు ఉపాధ్యాయులు రిలీవ్ కాలేదు. వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని HYD సెక్రటేరియట్‌లో PRTU తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల ఆర్థికపరమైన పెండింగ్ సమస్యలు కూడా త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.

News June 8, 2024

రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం జూన్ 10న జరగనుంది. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఇది జరుగుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, APC, PJTSAU ఇన్‌ఛార్జి ఉపకులపతి ఎం.రఘునందన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి C.P రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈస్నాతకోత్సవం జరుగుతుందని తెలిపారు.

News June 8, 2024

HYD: అంకితభావంతో పని చేయాలి: సీపీ అవినాశ్‌ మహంతి

image

పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పతకాలు సాధించాలని సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి సూచించారు. కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి శుక్రవారం కమిషనరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సీపీ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ.. సేవా పతకాలను అందుకున్న సిబ్బందిని అభినందించారు. 75 మంది పోలీస్‌ సిబ్బందికి పతకాలు అందజేసినట్టు తెలిపారు.

News June 8, 2024

HYD: వరి సాగు గణనీయంగా పెరుగుతోంది: మంత్రులు

image

తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సోనా రకం బహుళ ప్రాచుర్యం పొందిందని తెలిపారు. శుక్రవారం HYDలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ప్రపంచ వరి సదస్సు-2024ను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సదస్సులో 30 దేశాల నుంచి 150 మంది ఎగుమతిదారులు , దిగుమతిదారులు , శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

News June 8, 2024

HYD: చేప మందు ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి నుంచి చేప మందు పంపిణీ చేయనున్నారు. లక్షలాది మంది తరలిరానుండడంతో నాంపల్లి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు ఉదయం నుంచి 9వ తేదీ సా.6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రత్యేక పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్‌ను ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని, సహాయం కోసం హెల్ప్‌లైన్‌ 9010203626 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. SHARE IT

News June 8, 2024

HYD: మృగశిర కార్తె.. చేపలకు ఫుల్ డిమాండ్

image

మృగశిర కార్తె సందర్భంగా ముషీరాబాద్ మార్కెట్‌‌కు భారీగా చేపలు దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. సాధారణ రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల విక్రయాలు ఇక్కడ జరుగుతుంటాయి. శనివారం (మృగశిర కార్తె రోజు) 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు అమ్ముడుపోతాయని వ్యాపారులు వెల్లడించారు. రేపు సండే కూడా గిరాకీ ఉంటుందన్నారు. మరోవైపు‌ నాంపల్లి‌ ఎగ్జిబిషన్‌లో‌ చేపమందు కోసం శుక్రవారం రాత్రి నుంచి క్యూకట్టారు.

News June 7, 2024

యూరప్‌కు కమిషనర్.. ఆమ్రపాలికి GHMC బాధ్యతలు

image

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కమిషనర్ రోనాల్డ్ రాస్ 13 రోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. శనివారం నుంచి ఈ నెల 23 వరకు ఆయన యూరప్‌‌లో పర్యటించనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అదనపు బాధ్యతలు HMDA(హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ) జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 13 రోజులు తాత్కాలికంగా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. SHARE IT