India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD గచ్చిబౌలి స్టేడియంలో AP, TG క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి అభినందన వేడుకల్లో పాల్లొన్నారు. తాపేశ్వరం సురుచి బాహుబలి ఖాజాను కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఆయనకు అందజేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తర్వాత తన ప్రసంగంలో సీఎం ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదతో ఉస్మానియా, గాంధీ జూడాలు సమావేశమయ్యారు. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందించారు. రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి, ప్రత్యేక విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూడాల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనుంది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యాచరణ-2047లో RRRను అందులో చేర్చారు. వికసిత్ భారత్‌లో భాగంగా విస్తరించాల్సిన రహదారుల ప్రణాళికను కేంద్రం ఇటీవల రూపొందించింది. అందులో ప్రాంతీయ RRR చేర్చడంతో దీని నిర్మాణ ప్రక్రియ వేగం అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇప్పడు కొత్త సమస్యలకు తెర లేపుతుంది. భూసేకరణకు భిన్నమైన పరిస్థితులే ఎంఆర్‌డీసీఎల్‌కు ఎదురవుతున్నాయి. మూసీ బఫర్ జోన్‌గా నదికి ఇరువైపులా 50 మీటర్లు ఖరారు చేసే యోచనలో ఉండగా.. ఇదే అన్ని సమస్యలకు ప్రధాన కారణం కానుంది. 13వేలకు పైగా ప్రాపర్టీలు గుర్తించింది. దాంట్లో ఆలయాలు, వక్ఫ్ ఆస్తులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. వీటిని తొలగించడం క్లిష్ట ప్రక్రయే అనిపిస్తుంది.
తెలంగాణలో పర్యాటకశాఖకు చెందిన ఆస్తులన్నీ నిర్వీర్యమైపోయాయని, వాటి నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు కృషిచేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లోని పర్యాటక రంగం కంటే పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తెలంగాణలో ఎక్కువగా అవకాశాలున్నాయని తెలిపారు. ఏ పర్యాటక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి వేయాలనే కోణంలో అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఆన్లైన్‌లో నకిలీ ఉద్యోగ సంస్థల వలలో చిక్కి మోసపోవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ‘X’ వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టబద్ధమైన సంస్థలు ఉద్యోగ ఆఫర్ కోసం అభ్యర్థుల నుంచి డబ్బు అడగవని, ఎవరైనా డబ్బులు అడిగితే మోసమని గుర్తించాలన్నారు. ఫిర్యాదుల కోసం 1930కి లేదా డయల్ 100కి కాల్ చేయాలన్నారు.
బీఈడీ, ఎంఈడీ కోర్సులకు వివిధ సబ్జెక్టులు గెస్ట్ లెక్చరర్లుగా బోధించడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, మాసబ్ ట్యాంక్ ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. విద్యార్హత ఉన్నవారు జిరాక్స్ కాపీలతో ఈనెల 21 వరకు దరఖాస్తులు అందించాలని ఆమె సూచించారు. ఇతర వివరాలకు 9963119534లో సంప్రదించాలన్నారు.
సిటీలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ సరికొత్త మార్పులు చేస్తున్నారు. జూపార్క్, జంతువుల పూర్తి వివరాలను తెలియజేసేలా అధికారులు జూ పీడియా యాప్‌ను తీసుకురాబోతున్నారు. దీని ద్వారా జూపార్కులో ఏయే జంతువు ఏ ప్లేస్‌లో ఉందో సందర్శకులు ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం జంతువులకు చిప్స్ అతికించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2025 హజ్ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి హజ్ యాత్రకు ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. యాత్రికుల సౌకర్యార్థం నాంపల్లి హజ్‌హౌస్‌లోని రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో సోమవారం నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారిని హజ్ యాత్రకు నేరుగా ఎంపిక చేయనున్నారు.
శ్రీలంక మంత్రి వియలేంద్రన్‌తో HYD నగరంలో సమావేశం జరిగినట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గత పది ఏళ్లలో తెలంగాణలో జరిగిన వేగవంతమైన అభివృద్ధిపై మంత్రి చెప్పిన మాటలు తనకు ఎంతో గర్వంగా అనిపించిందని కేటీఆర్ అన్నారు. గత పది ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంపదను సృష్టించడంతో పాటు, సంక్షేమానికి ఖర్చు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.