RangaReddy

News August 18, 2024

HYD: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి (అప్‌డేట్)

image

హైదరాబాద్ శివారు పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్‌ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం తుఫాన్‌ వాహనాన్ని మరో కారు ఢీ కొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం దీక్షిత (13) మృతి చెందింది. మరో ఇద్దరు (అర్చన, కీర్తి) పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News August 18, 2024

HYD: హకీంపేట్‌కు స్పోర్ట్స్ యూనివర్సిటీ..?

image

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట సమీకృత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో క్రీడలకు ఆసక్తి పెంపొందించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ దోహదపడుతుంది. ఇందులో భాగంగా క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలిక వసతులతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రస్తుతం హకీంపేట్‌లో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.

News August 18, 2024

HYD: 87126 71111 ఈ నంబర్ సేవ్ చేసుకోండి: డీజీపీ

image

విద్యాసంస్థల్లో డ్రగ్స్, ర్యాగింగ్ అరికట్టడానికి పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ HYDలో అన్నారు. తెలంగాణలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాంటీ నార్కోటెక్ తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. డ్రగ్స్, ర్యాగింగ్ పై 87126 71111 నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఈ నంబర్ సేవ్ చేసుకోవాలన్నారు.

News August 18, 2024

BREAKING: HYDలో భారీ వర్షం 

image

HYDలో భారీ వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డినగర్, బాలాపూర్, అల్మాస్‌గూడ, నాదర్‌గుల్, మీర్‌పేట్, బడంగ్‌పేట్ తదితర ప్రాంతాల్లో సుమారు అర గంట నుంచి భారీ వర్షం కురుస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా కామెంట్ చేయండి. 

News August 18, 2024

HYD మెట్రోలో ఇబ్బంది పడితే ఫిర్యాదు చేయండి..!

image

HYD మెట్రో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇబ్బందులకు గురైతే వాటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలపాలని అన్నారు. మెట్రోలో ఏసీ సరిగా రావడం లేదని ఓ వ్యక్తి తెలపగా, ప్రస్తుతం మెట్రోలో ఏసీ 22-24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. వాట్సాప్ నంబర్ 7995999533 ద్వారా సమస్యలు తెలపాలని కోరారు. SHARE IT

News August 18, 2024

HYD: వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించటం ఇక సులువు!

image

HYDలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు తెలిపారు. దీనిని తాడుతో పంపుతారని, 100 కేజీల బరువు వరకు లాగుతుందని తెలిపారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

News August 18, 2024

HYD: 33KV విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు

image

HYD మెట్రో జోన్ పరిధిలో 18, రంగారెడ్డి జోన్ పరిధిలో 25, మేడ్చల్ జూన్ పరిధిలో 18 చొప్పున కొత్తగా 33KV ఉపకేంద్రాలను ఏర్పాటుకు చీఫ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక రచించారు. గృహ, వాణిజ్య, మాల్స్ నిర్మాణాల దూకుడుతో విద్యుత్ వినియోగం ఏటేటా పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో డిమాండ్ తట్టుకునేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు ఇంజినీర్లు లేఖ రాశారు.

News August 18, 2024

HYD: ఫైర్ ఇంజిన్ అద్దెకు బుక్ చేసుకోవడం ఇక ఈజీ..!

image

HYDలో కార్నివాల్, నుమాయిష్, ఎల్బీ స్టేడియంలో మ్యాచ్, సభలు, వివాహ, ఇతర వేడుకలు, సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారా.. అయితే అక్కడ అగ్నిప్రమాదాల నివారణకు ఫైరింజిన్లను అద్దెకు తీసుకోవచ్చు. గంటలు, రోజుల చొప్పున అద్దె చెల్లించి సేవలు పొందొచ్చని అగ్నిమాపక శాఖ తెలిపింది. నూతనంగా 8 అధునాతన పంపులను కొనుగోలు చేశారు. ఫైర్ ఇంజిన్ https://fire.telangana.gov.in/WebSite/standby.aspx ద్వారా బుక్ చేసుకోండి.

News August 18, 2024

HMDA పరిధి పార్కులు, చెరువుల సుందరీకరణపై ఫోకస్

image

HMDA పరిధిలో చెరువులు, పార్కుల సుందరీకరణపై అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువుల సుందరీకరణకు రూ.22 కోట్లు, కొత్తగా 15 ఫారెస్టు బ్లాకుల ఏర్పాటు, నర్సరీల పెంపునకు నిధులు రూ.75 కోట్లు, కొత్త పార్కుల్లో థీమ్స్ అభివృద్ధి, సరస్సుల సుందరీకరణ, పాత పార్కుల్లో థీమ్స్ మార్పుకు రూ.144కోట్లు, గోల్డెన్ మైన్స్ వే 20 ఎకరాల్లో మయూరినగర్ అమీన్‌పూర్ రాక్ గార్డెన్ నిర్మాణం, కాలనీ పార్కులకు రూ.46 కోట్లు వెచ్చించనున్నారు.

News August 18, 2024

GHMC పరిధిలో మీడియన్ గార్డెనింగ్ పనులు

image

మోడల్ కారిడార్ల పొడవునా అలంకరణ జాతులకు చెందిన మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా అధికారులు నాటుతున్నారు. శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్ల పరిధిలోని రోడ్డు విభాగినులపై వరుసగా 1.13 లక్షలు, 70 వేలు, కూకట్‌పల్లి జోన్ రహదారులపై 18 వేల మొక్కలను నాటనున్నారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో 38,400 మొక్కలను నాటుతున్నారు.