RangaReddy

News August 18, 2024

సికింద్రాబాద్: పార్ట్ టైం జాబ్ అని రూ.8.62 లక్షలు లూటీ

image

కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇస్తామంటూ నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారికి ఆన్‌లైన్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. మొదటగా కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇచ్చారు. తర్వాత పెట్టుబడి పెట్టాలని సూచించగా.. నమ్మిన బాధితుడు రూ.8.62 లక్షలు పెట్టేశారు. తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News August 18, 2024

GHMCలో వారందరికీ స్థాన చలనం

image

GHMCకి కొత్తగా వచ్చిన అధికారులకు బాధ్యతల అప్పగింత, ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న పలువురికి అంతర్గత స్థానచలనం కల్పించే ప్రక్రియ మొదలైంది. పారిశుద్ధ్య, ప్రణాళిక విభాగాల్లోని పలువురు అధికారులకు బాధ్యతలు కేటాయిస్తూ కమిషనర్ ఆమ్రపాలి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత బదిలీలు ఇంకా ఉంటాయని, వేర్వేరు విభాగాల్లో రెండేళ్లుగా ఒకే స్థానంలో ఉన్న అధికారులు, సిబ్బందికి స్థాన చలనం ఉంటుందన్నారు.

News August 18, 2024

HYD: ట్రాఫిక్ సమస్యలపై సీపీలు, ట్రాఫిక్ అధికారులతో డీజీపీ సమీక్ష

image

HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, ట్రాఫిక్ అధికారులతో DGP డా.జితేందర్ సమావేశమై, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ఇతర సమస్యలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పరిస్థితి, ట్రాఫిక్ రద్దీకి గల కారణాలు, రద్దీని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

News August 18, 2024

HYD: భారీ వరద.. హుస్సేన్ సాగర్ గేట్లు OPEN

image

భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు శనివారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్‌లోకి వరద పెరిగిందని, దీంతో నీటిని దిగువకు వదిలామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. ఇన్‌ఫ్లో 2,075 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ఫ్లో 1,538 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలామని చెప్పారు.

News August 18, 2024

ఓయూలో పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు

image

ఓయూ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పీజీ కోర్సుల బ్యాక్‌లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీలోగా చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలకు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News August 18, 2024

HYD: స్కిల్‌ యూనివర్సిటీలో దసరా నుంచి ఆరు కోర్సులు: సీఎస్‌

image

కొత్తగా ప్రారంభించిన స్కిల్‌ యూనివర్సిటీలో పలు రంగాల కోర్సులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై శనివారం CS ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించామని.. ఇందులో దసరా నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

News August 17, 2024

‘సెప్టెంబర్ 6న ఛలో హైదరాబాద్.. బీసీ కులగణన మార్చ్’

image

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం బషీర్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న ఛలో హైదరాబాద్ పేరుతో బీసీ కుల గణన మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News August 17, 2024

ఓయూలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ డేటా సైన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News August 17, 2024

HYD‌: విషాదం.. తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

image

శామీర్‌పేట PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శామీర్‌పేట పరిధి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2 మృతదేహాలు లభించగా బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మర్కంటి భానుప్రియ(తల్లి), కుమారుడు ఆనంద్ (5), కుమార్తె దీక్షిత (4)గా పోలీసులు గుర్తించారు. పిల్లల అనారోగ్యానికి సంబంధించి భర్తతో గొడవపడిన తర్వాత సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదైంది.

News August 17, 2024

వర్షాకాలం వేళ గ్రేటర్‌లో రంగంలోకి దిగిన DRF..!

image

గ్రేటర్ HYD పరిధిలో వ్యర్థాలను తరలించడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం DRF బృందాల పని గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో 80 డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.GHMC ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 22 ట్రక్కులు, 8 LMV వాహనాల్లో సేఫ్టీ పరికరాలు, రెస్క్యూ టూల్స్, డీ-వాటరింగ్ పంప్స్, మోటార్లు, ఫైర్ ఫిట్టింగ్ పరికరాలు అందుబాటులో ఉంచారు.