RangaReddy

News August 17, 2024

ఉప్పల్: హబ్సిగూడ యాక్సిడెంట్.. చనిపోయింది టెన్త్ విద్యార్థినే

image

ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ వద్ద <<13875264>>ఆటోను కంటైనర్ ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో గాయపడ్డ ఆటో డ్రైవర్‌తో పాటు విద్యార్థిని సాత్వికను నాచారం ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని సాత్విక మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కాగా హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో సాత్విక పదో తరగతి చదువుతోంది.

News August 17, 2024

HYD: ట్రాన్స్‌జెండర్ల కోసం జిల్లాకో ప్రత్యేక క్లినిక్

image

రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం 33 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు నిర్మించనుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ చేస్తోంది. ట్రాన్స్‌జెండర్లకు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సంక్షేమ శాఖ ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

News August 17, 2024

త్వరలో HYDలో బెంగళూరు మోడల్!

image

HYD నగరంలో పలు ప్రాంతాల నుంచి డైరెక్ట్ మెట్రో స్టేషన్ల పాయింట్ల వద్దకే బస్ సర్వీస్ ప్రారంభించి ఆదాయం పెంచుకోవడంపై మెట్రో దృష్టి పెట్టింది .బెంగళూరులో మెట్రో ఫీడర్ బస్ సర్వీస్ పాయింట్లను పెంచడం ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అదే మోడల్ HYDలో అమలు చేయాలని యోచిస్తోంది. గతేడాది బెంగళూరులో డిసెంబర్ వరకు 65 స్టేషన్లలో రోజుకు 5.60 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం 6.8-7.50 లక్షలకు పెరిగారు.

News August 17, 2024

HYD: జువైనల్ హోంలో మత్తు విముక్తి కేంద్రం

image

సైదాబాద్ జువైనల్ హోంలో మత్తు బానిసలుగా మారుతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు ‘మత్తు విముక్తి కేంద్రం’ ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ క్లినిక్‌‌‌‌‌లో పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గలవారు www.wdsc.telangana.gov.in వెబ్సైట్ నుంచి లేదా 040-245590480లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

News August 17, 2024

HYD: మూసీ వెంట 12,182 అక్రమణల గుర్తింపు!

image

HYD నగరంలో మూసీ ప్రక్షాళన వడివడిగా సాగుతోంది. ముఖ్యంగా ఆక్రమణలను గుర్తించిన అధికారులు ప్రత్యేక యాప్‌లో వివరాలు పొందుపరిచారు. గండిపేట నుంచి ఘట్‌కేసర్ వరకు ఆక్రమణలను గుర్తించారు. రాజేంద్రనగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, బహదూర్‌పుర, నాంపల్లి, అంబర్‌పేట, ఉప్పల్‌లో ఎక్కువ శాతం ఆక్రమణలు ఉన్నట్లు 33 బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకు అన్ని మండలాల్లో కలిపి 12,182 అక్రమణాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు.

News August 17, 2024

HYD: హైడ్రా.. ఏడు జిల్లాల్లో చర్యలకు కసరత్తు!

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో HYDRA సంస్థ పని చేస్తోంది. మొత్తం 70 మండలాలు విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీతో పాటు నిజాంపేట, బండ్లగూడ జాగీర్, బడంగ్పేట, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మీర్పేట నగరపాలక సంస్థలు, 30 పురపాలక సంఘాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే HYDలో వణుకు పుట్టిస్తున్న సంస్థ, ఇక కార్పొరేషన్లలోనూ చర్యలు ప్రారంభించనుంది.

News August 17, 2024

సికింద్రాబాద్: 19, 20న ఎనిమిది ప్రత్యేక రైళ్లు

image

పంద్రాగస్టు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈనెల 19, 20న మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- నర్సాపూర్ మార్గంలో 2, కాచిగూడ-తిరుపతి మార్గంలో 2, సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మార్గంలో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పీఆర్వో శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, నడికుడి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయని వెల్లడించారు.

News August 17, 2024

HYD: HYDRA.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది!

image

ప్రభుత్వ భూముల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం అతిపెద్ద సంస్థగా ఏర్పడిన HYDRA అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో HYDRA కమిషనర్ రంగనాథ్ IPS నేతృత్వంలో కొనసాగుతోంది. ఇద్దరు ఎస్పీలు, పలు విభాగాల అధికారులతో కలిపి దాదాపు 3,000 మందితో సంస్థ మరింత బలపడనుంది. ఇప్పటికే HYDలో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

News August 17, 2024

పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థకు జలమండలి రూపకల్పన

image

అవుటర్ రింగ్ రోడ్డు లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పక్కా మురుగు నీటి వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రణాళికకు జలమండలి రూపకల్పన చేస్తోంది. పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దాలని యోచిస్తోంది. దాదాపు 4,600 కి.మీ మేరకు డ్రైనేజీ వ్యవస్థ అవసరమని జలమండలి గుర్తించింది. త్వరలో అవుటర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీం, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో 32 మురుగు శుద్ధి కేంద్రాలు నిర్మించనుంది.

News August 17, 2024

HYD: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘కోడింగ్’పై శిక్షణ

image

అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు ‘కోడింగ్’పై శిక్షణ ఇస్తున్నారు. ఐదో తరగతి విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తున్నారు. బషీర్ బాగ్‌‌లోని మహబూబియా ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సులభంగా ఐప్యాడ్, ల్యాప్‌టాప్‌‌లను ఆంగ్లభాష సంకేతాలు, పదాలతో వాడుతున్నారు. ఐటీ సంస్థల ఉద్యోగులు, యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు.