India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
12 ఏళ్ల వయసులోనే అనాథాశ్రమాలు, స్కూళ్లలో సొంతంగా లైబ్రరీలను ఏర్పాటు చేసిన HYDకు చెందిన ఆకర్షణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు 15న న్యూఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్‌లో పేరెంట్స్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇతరులకు విద్యాజ్ఞానం అందిస్తున్న ఆకర్షణను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ప్రెసిడెంట్ సూచనతో మరింత ముందుకెళ్తామని ఆకర్షణ తెలిపారు.
పంద్రాగస్టు రోజే HYDలో ఓ అమ్మాయి వేధింపులకు గురైంది. మాదాపూర్‌లో జాబ్ చేసే యువతి(23) మెట్రో ఎక్కి JBS స్టేషన్‌లో దిగింది. సిద్దిపేట వెళ్లేందుకు బస్టాండ్‌కు పరుగులు తీసింది. అప్పటికే భారీ వర్షంతో బస్టాండ్ ఆవరణం నీళ్లతో నిండిపోయింది. దీంతో వెనక గేట్ నుంచి లోపలికి వెళుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వెనకాలే వచ్చి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె మారేడ్‌పల్లి PSలో ఫిర్యాదు చేసింది.
12 ఏళ్ల వయసులోనే అనాథాశ్రమాలు, స్కూళ్లలో సొంతంగా లైబ్రరీలను ఏర్పాటు చేసిన HYDకు చెందిన ఆకర్షణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు 15న న్యూఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్‌లో పేరెంట్స్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇతరులకు విద్యాజ్ఞానం అందిస్తున్న ఆకర్షణను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ప్రెసిడెంట్ సూచనతో మరింత ముందుకెళ్తామని ఆకర్షణ తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వివరాలకు ఓయూ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.
వాట్సాప్ వివాదం బంజారాహిల్స్ PSకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బంజారాహిల్స్ NBT నగర్ అసోసియేషన్ పేరుతో ఏర్పాటు చేసిన గ్రూపులో పావని శర్మ అనే యువతి మేయర్ విజయలక్ష్మీకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారు. దీనిని గమనించిన మేయర్ అనుచరులు ఆమె ఇంటికి వెళ్లి బెదిరించి, PSలో ఫిర్యాదు చేశారు. దీన్ని తట్టుకోలేక పావని శర్మ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అనంతరం మేయర్ పై PSలో ఫిర్యాదు చేసింది.
HYDలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరికాసేపట్లో వెస్ట్ హైదరాబాద్(గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరువు, మూసాపేట్, కూకట్‌పల్లి)లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు @Hyderabadrains పేర్కొంది. ఇప్పటికే నల్లటిమబ్బులు అలుముకున్నాయి. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. భారీ వర్షం, వరదల్లో రిస్క్ చేయకండి.
గంజాయి ముఠాను సుమారు 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. HYD-విజయవాడ హైవేలోని పతంగి టోల్ ప్లాజా వద్ద నలుగురు సభ్యులున్న ఓ గంజాయి ముఠాను నల్గొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఈరోజు పసిగట్టారు. అక్కడ వారిని అడ్డుకోగా కారుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకోవడంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంబడించి HYD శివారు అబ్దుల్లాపూర్‌మెట్ JNNURM వద్ద అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిను సీజ్ చేశారు.
BJPలో BRS విలీనం అవనుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అది కాంగ్రెస్ విష ప్రచారమని, ఊహాజనిత వ్యాఖ్యలని మండిపడ్డారు. BJPలో అలాంటి చర్చ ఏం లేదని, ఫేక్ ప్రచారం మానుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.
HYD నగరానికి మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీలు తరలించనున్నారు. రెండేళ్లలో భారీ పైప్ లైన్, నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగనుంది. 40 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం, 60% ఏజెన్సీ ఖర్చును భరించనుంది. మొత్తం రూ.5,560 కోట్లతో ఈ పైపుల నిర్మాణం జరుగనుంది. ఇందులో ప్రాజెక్టు దక్కించుకున్న ఏజెన్సీ రూ.3,336 కోట్లు భరించి, ఆ తర్వాత జలమండలి నుంచి వసూలు చేయనుంది.
అలంకరణ కోసం వాడే థర్మోకోల్, క్యాండీ స్టిక్, ఐస్క్రీమ్ స్టిక్, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ ఫోర్లు, చెంచాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ కవర్లు సహా అనేక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం 2022 జులైలో నిషేధం ప్రకటించింది. కేంద్ర పర్యావరణశాఖ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా GHMC అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.