India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. సచివాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని కొనియాడారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ వర్సిటీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో గవర్నర్ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.
గ్రేటర్ HYD సహా ఔటర్ ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్న వాటర్ బోర్డుకు కరెంటు బిల్లు గుదిబండగా మారింది. పంపింగ్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో రూ.105 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు నెలకు బిల్లులు వస్తున్నాయి. అయితే వాటర్ బోర్డు మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో రాయితీ ఇచ్చి, యూనిట్‌కు రూ.3.95 వసూలు చార్జీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
గ్రేటర్ HYD పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణానికి
23 ప్రదేశాల్లో అనుమతులు వచ్చినట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. పనులు చేపట్టేందుకు జోనల్ అధికారులు తగు చర్యలు
తీసుకోవాలన్నారు. మరోవైపు గ్రేటర్ వ్యాప్తంగా కుక్కల బెడద, కుక్క కాటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.
వందల ఏళ్లు పరాయి పాలనలో మగ్గిన భారతీయులకు 1947 ఆగస్ట్ 15న విముక్తి లభిస్తే.. హైదరాబాద్‌లో మాత్రం నిర్బంధం కొనసాగింది. కొందరు విద్యావంతులు రేడియో ప్రసారాల ద్వారా వాటిని తెలుసుకున్నారు. పైగా స్వాతంత్ర్యం శుక్రవారం వచ్చింది. ఆరోజు ఇక్కడ అన్నింటికీ సెలవు. దీంతో విద్యాసంస్థలు, దుకాణాలు బంద్ అయ్యాయి. ఉద్యమాలు చేసిన విద్యార్థులు, యువత సంబరాలు జరుపుకోలేకపోయారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వసతి గృహాల్లోని విద్యార్థులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కిటికీలు, తలుపులు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలు పంచాయతీ కార్యదర్శి లోకల్ బాడీ వారి సహకారం తీసుకోవాలన్నారు. వార్డెన్లతో ప్రతివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలపై ఆరాతీసి పరిష్కరించాలని ఆయన సూచించారు.
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకునే పోలీసులను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, రెండేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్ యాదయ్య 7కత్తి పోట్లకు గురైనా.. తెగించి నిందితులను పట్టుకున్నారు. దీంతో ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పతకం ఆయనను వరించింది. దీనికి ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. నాడు మాదాపూర్‌లో మహిళ మెడలో చైన్ లాక్కెళ్లినవారిని పట్టుకునే క్రమంలో బొల్లారంలో ఆయనపై దాడిచేశారు.
గ్రేటర్ HYD నగరాన్ని గ్రేటెస్ట్ హైదరాబాద్‌గా చేస్తామని ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. HYD నగరానికి ప్రపంచ దేశాల నుంచి భారీ పెట్టబడులు తీసుకొచ్చామన్నారు. మూసీ నది ప్రక్షాళన కోసం నిధులు కేటాయించామని, గ్రేటర్ హైదరాబాద్ కోసం బడ్జెట్లో పెద్దపీట వేశామన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
రాయదుర్గం పీఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్‌కు గురైంది. స్కూల్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంబడే ప్రత్యేక టీమ్ గాలింపు చేపట్టింది. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలికను పోలీసులు గంటలో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను మేయర్ శాలువాతో సన్మానించి సత్కరించారు. నూతనంగా గవర్నర్‌గా నియామకమైనందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా గవర్నర్ పరిపాలన అందించాలని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.