India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండు వినియోగం రాబోయే 8ఏళ్లలో భారీగా పెరుగుతాయని కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ ) అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రోజువారీ నమోదైన 15,701 మెగావాట్ల గరిష్ఠ డిమాండుకు ఏటా 5.5 నుంచి 7.6% చొప్పున అదనంగా పెరుగుతుందని తెలిపింది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ గరిష్ఠ విద్యుత్ డిమాండు 15,704 మెగావాట్లు ఉండగా.. 2031-32లో 27,050 మెగావాట్లకు చేరుతుందని అంచనా.
సీఎం రేవంత్ రెడ్డి HYD శంషాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనలో 50 రౌండ్ టేబుల్ సమావేశాలు, మరోవైపు నెట్ జీరో సిటీ, AI సిటీ, స్కిల్ యూనివర్సిటీ, MSRD ప్రణాళికపై వివరణ, అంతేకాక AI, డేటా సెంటర్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు చెందిన కంపెనీలతో పాటు ఫార్మా, లైఫ్ సైన్సెస్, కాస్మటిక్స్ , టెక్స్‌టైల్, ఎలక్ట్రిక్ వాహనరంగాలకు చెందిన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు CMO తెలిపింది.
HYD నగరంలో క్షణాల్లో కోట్లు మాయమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఇటీవలే ఈ కేటుగాళ్లను HYD పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడికి మాయ మాటలు చెప్పి ఏకంగా రూ.5.4 కోట్లు బ్యాంకు ఖాతా నుంచి మాయం చేశారు. ఆసీఫ్‌నగర్ ప్రాంతంలోనూ ఈ ఘటనలు జరిగాయి. జర జాగ్రత్త..!
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన 10 నెలల తర్వాత ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మూసివేసిన పాత ఇనుప దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు లంచం తీసుకోవడమే కాకుండా మరింత కావాలని డిమాండ్ చేశారని వచ్చిన ఫిర్యాదుతో సీబీఐ హైదరాబాద్ విభాగం స్పందించింది. జీఎస్టీ సూపరింటెండెంట్ వి.డి.ఆనంద్ కుమార్, ఇన్‌స్పెక్టర్ మనీశ్ శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోబో చికిత్సలు ప్రవేశపెట్టిన ఏడాదిలోనే 300 వరకు శస్త్రచికిత్సలు చేసిన అరుదైన ఘనతను నిమ్స్ వైద్యులు సొంతం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న పేద రోగులకు ఉచితంగా, ఇతర రోగులకు తక్కువ ఖర్చుతోనే ఈ సేవలందిస్తున్నారు. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు పరిమితమైన ఈ రోబోటిక్ సేవలను గతేడాది ఆగస్టులో దాదాపు రూ.30 కోట్లతో నిమ్స్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఎక్కువ శాతం ఈ సేవలు పేదలకే అందుతున్నాయి.
యువకుడి ఆత్మహత్య కేసులో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా.. మనస్తాపం చెందిన యువతి భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగేసి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకు వెళ్తున్నా అంటూ’ ఉరేసుకొన్నాడు.
HYD నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసేవారు. నేటి నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. బైక్‌లు మినిమం 2 గంటల వరకు నిలిపి ఉంచితే రూ.10, 8 గంటల వరకు రూ.25, 12 గంటల వరకు నిలిపితే రూ. 40 చొప్పున చెల్లించాలి. కారు పార్కింగ్ ధరలు వీటికంటే మూడింతలు ఎక్కువగా నిర్ణయించారు. దీనిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పంద్రాగస్టు నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆంక్షలు విధించారు. జంటనగరాల్లో కీలకమైన సికింద్రాబాద్‌లోనూ నిఘా పెంచారు. మంగళవారం రాత్రి మార్కెట్ పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో 31 బస్టాప్ తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను అపి సోదాలు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అపార్ట్‌మెంట్‌లో ఉండేవారికి GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట కీలక సూచన చేశారు. మంగళవారం అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చెత్త కోసం డోర్ టూ డోర్ తిరగకుండా ఒక చోట డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేస్తే సేకరణ సులభతరం అవుతుందన్నారు. అపార్ట్‌మెంట్ అసోసియేషన్ వారిని సంప్రదించి డస్ట్ బిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కుల వద్ద కూడా ఇలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.
HYD నగర శివారు కందుకూరు ప్రాంతంలో నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన, రసాయన సమ్మేళనాల కాలుష్యంతో ప్రజా జీవనంపై ప్రభావం పడకుండా, జాతీయ కాలుష్య ప్రమాణాలను పాటించి, జీరో కార్బన్ ఎమిషన్ సిటీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ సిటీలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పచ్చదనంతో HYD పరిసరాల్లో ఉష్ణోగ్రత కంటే 2-3 డిగ్రీలు సెంటీగ్రేడ్లు తక్కువగా ఉండనున్నాయి.
Sorry, no posts matched your criteria.