India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుందని, భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు.
గ్రేటర్ HYD పరిధిలో దాదాపుగా 75 లక్షల వాహనాలు ఉన్నట్లుగా అధికారుల లెక్కల్లో తేలింది. రూ.170 కోట్ల లీటర్ల పెట్రోలు, రూ.150 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే..15 ఏళ్లకు పైబడిన వాహనాలు దాదాపుగా 15 లక్షలకు పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వాహనాల వల్ల గాలి కాలుష్యం పెరిగి, ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
GHMC గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ప్రాంతంలో జేసీ నగర్, వలావర్ నగర్, కాప్రా ఛత్రపతి శివాజీ గ్రౌండ్, శేర్లింగంపల్లి గోపనపల్లి తండా, మియాపూర్ బస్ డిపో వెనుక, కూకట్పల్లి ఎస్ఆర్ నాయక్ నగర్, అల్వాల్, ఖైరతాబాద్ లంగర్ హౌస్, సికింద్రాబాద్ తిరుమలగిరి, ప్రాంతాల్లో ఫుట్ బాల్ మైదానాల కోసం స్థలాలను అధికారులు గుర్తించారు.
వాహన కొనుగోలులో షోరూమ్‌లు ఇచ్చిన డిస్కౌంట్‌కు కూడా పన్ను చెల్లించాల్సిందేనని, పూర్తి ట్యాక్స్ కడితేనే ఆ వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాహన ధర ఆర్టీఏ డేటాబేస్‌లో ఉంటుందని, డిస్కౌంట్ అనేది పన్ను మినహాయింపునకు కాదని కస్టమర్లు గుర్తించాలని సూచించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం ఏ ధరకు కొనుగోలు చేసినా పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీ సీట్ల కోసం శిక్షణ అందిస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ, సీనియర్ సబ్జెక్టు అసోసియేట్లు 2 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వేతనాలు ఇచ్చేవరకు పాఠాలు బోధించబోమంటూ గౌలిదొడ్డి సీఈవో సహా అన్ని కేంద్రాల్లో సబ్జెక్టు అసోసియేట్లు సోమవారం నుంచి ‘చాక్ డౌన్’ చేపట్టారు. ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హెచ్‌ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయని పలవురు అభిప్రాయ పడుతున్నారు. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్‌ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నెమ్మదిగా సాగుతున్న పనుల మూలంగా కేంద్రీకృతానికి జాప్యం జరగనుంది. పైగా ప్యాలస్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ పనులతో తరలింపు ప్రక్రియ ఎప్పుడనేది ఇంకా స్పష్టత రావడంలేదు.
శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారం. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ (ఎలివేటెడ్) మార్గాలే. విమానాశ్రయ కారిడార్‌లో ఆకాశమార్గంతో పాటు తొలిసారిగా భూమిపై కొంత, భూగర్భంలో మరి కొంత దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లో పొందుపర్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు స్థానికత వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. మెడికల్ నిబంధనలను సవరిస్తూ రూల్స్ 3A చేర్చి ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరాధే వాదనలు విని, ప్రతివాదులైన వైద్యఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14కు వాయిదా వేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగిస్తున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలతో గడువు ముగియనుంది. తాజాగా గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు వెల్లడించారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతో పాటు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన SLBC టన్నెల్ పనులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ఒహాయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మానుఫ్యాక్చరింగ్ కంపెనీని సందర్శించి మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.