RangaReddy

News August 13, 2024

HYD: బిగ్‌ అలర్ట్.. మరో గంట పాటు వర్షం

image

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. తాజాగా వాతావరణ కేంద్రం అధికారులు నగరవాసులను అప్రమత్తం చేశారు. మరో గంట పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ముషీరాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌లో‌ వర్షం నీళ్లు రోడ్ల మీదకు వచ్చి చేరడంతో‌ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని‌ జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

News August 13, 2024

హైదరాబాద్: బంద్‌కు పిలుపు.. భారీ స్పందన

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పలు సంఘాలు బంద్‌కు పిలుపునిస్తున్నాయి. సోమవారం హయత్‌నగర్‌, వికారాబాద్‌, కీసర తదితర చోట్ల భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. నేడు నగరంలోని‌ పలు డివిజన్‌ల బీజేపీ నాయకులు‌ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. నవాబుపేట, బొంరాస్‌పేటలో ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.

News August 13, 2024

HYD: గ్రేటర్‌లో విజృంభిస్తున్న డెంగ్యూ

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. దోమ కాటుకు గురై చిన్నారులు, యువకులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో భారీగా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు సరైన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో కూడా దీని బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు.

News August 12, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే వడ్డీ తక్కువ: భువనగిరి ఎంపీ
✓HYD: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్ బిడ్డ కావేరి
✓ఉమ్మడి జిల్లాలలో హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం
✓రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు HYD వినియోగదారుల కమిషన్ జరిమానా
✓కాంగ్రెస్ పార్టీ అసమర్థత స్పష్టమవుతుంది: ఎమ్మెల్యే వివేకానంద
✓రాష్ట్రపతి భవన్ నుంచి ఆకర్షణకు పిలుపు

News August 12, 2024

HYDలో డేంజర్ బెల్స్

image

హైదరాబాద్‌లో విషవాయువు ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. పలు చోట్ల ‘గ్రౌండ్ లెవెల్ ఓజోన్’ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన ప్రమాణాలకు మించి నమోదు అవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వివరాల మేరకు 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదయ్యాయి. సనత్‌నగర్‌లో అత్యధికంగా క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములగా నమోదైంది.

News August 12, 2024

HYD: వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

image

వేణు స్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రెటీస్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. సినిమా వారి జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు నాగచైతన్య-శోభిత ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషిస్తూ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే..

News August 12, 2024

HYD: రాష్ట్రపతి భవన్ నుంచి స్టూడెంట్ ఆకర్షణకు పిలుపు

image

ఈనెల 15 ఇండిపెండెన్స్‌డేన రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమానికి రావాల్సిందిగా 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణకు ఆహ్వానం అందింది. అనాథాశ్రమాలు, స్కూళ్లల్లో సొంతంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్న ఆకర్షణ‌ను ఇటీవల ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఇప్పటివరకు 14 లైబ్రరీలను ఆకర్షణ ఏర్పాటు చేసిందని, మరిన్ని పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉందని తండ్రి సతీష్ తెలిపారు.

News August 12, 2024

HYD: కాంగ్రెస్ అసమర్ధత స్పష్టంగా కనిపిస్తోంది: MLA

image

తెలంగాణలో సాధారణ సాగు 1.29 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి ఆగస్టు 10 నాటికి కేవలం 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవ్వడం కాంగ్రెస్ అసమర్ధ పాలనకు నిదర్శనం అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదని, విత్తనాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని హితువు పలికారు.

News August 12, 2024

HYD: ముందుకు సాగని ఎలివేటెడ్‌ కారిడార్ పనులు..!

image

హైదరాబాద్‌ నగరానికి ప్రతిష్ఠాత్మకమైన 2 ఎలివేటెడ్‌ కారిడార్ల ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ఓ వైపు రక్షణ శాఖ నుంచి తీసుకున్న భూములకు పరిహారం, ఇతర ప్రాంతాల్లో భూముల బదలాయింపు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇక ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తి స్థాయి అంచనాకు ప్రభుత్వం రాలేకపోయింది. కనీసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు.

News August 12, 2024

HYD: ORRపై వాహనదారుల ఇష్టారాజ్యం

image

ఔటర్ రింగ్ రోడ్‌లో వాహనదారులు ఇష్టానుసారంగా ఔటర్ రింగ్ రోడ్డు 1, 2 లేన్లలోనే కాకుండా, రాంగూట్‌లోనూ రాకపోకలు సాగిస్తున్నారు. లీజుకు తీసుకున్న ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఔటర్‌పై భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వాహనాలు 190 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అవకాశం కల్పించినా మొదటి, 2 లేన్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాహనాలను పర్యవేక్షించే పెట్రోలింగ్ వాహనాలు లేక పర్యవేక్షణ కొరవడింది.