RangaReddy

News August 12, 2024

HYD: వృత్తి విద్యా కోర్సుల కళాశాలల్లో అధ్యాపకుల కొరత?

image

వృత్తి విద్యా కోర్సుల కళాశాలల్లో కొన్నేళ్లుగా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. మూడు జిల్లాల్లో ప్రభత్వ జూనియర్ కళాశాలలకు అనుబంధంగా, సొంతంగా 18 వృత్తి విద్య కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఐదు వందల మందికిపైగా విద్యార్థులున్నారు. గతేడాది అధ్యాపకులను నియమిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ ఒకటి, రెండు కళాశాలలు మినహా నియామకాలు చేపట్టలేదు.

News August 12, 2024

HYD: శాంతిభద్రతలు గాడి తప్పాయి: MLA ముఠాగోపాల్

image

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గాడి తప్పాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో రోజుకో హత్య జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో పాలన లేకపోవడం వల్ల చెత్తాచెదారం, మట్టికుప్పలు పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. దోమల వ్యాప్తి పెరిగిపోతుండటంతో, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

News August 12, 2024

HYD: స్వలింగ సంపర్కమే హత్యకు కారణం?

image

బాలాపూర్‌లో ఇటీవల జరిగిన <<13811088>>రియాజ్ హత్య<<>> కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాలు..యాకుత్‌పుర వాసి రియాజ్.. ఆయూబ్‌ఖాన్ గ్యాంగ్ నుంచి బయటకు వచ్చి మరో గ్యాంగ్ నడుపుతూ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు.ఈవిషయం ఆయూబ్ గ్యాంగ్‌కు తెలిసిందని రియాజ్ గుర్తించాడు. ప్రత్యర్థి కుమారుడిని తన గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించి 10రోజులు స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు.దీంతో ప్రత్యర్థి గ్యాంగ్ రియాజ్‌ను చంపేసింది.

News August 12, 2024

నీరుగారుతున్న స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యం?

image

గ్రేటర్‌లో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడితప్పింది. ఎక్కడ పడితే అక్కడే అవి దర్శనమిస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాల సేకరణకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇచ్చారు. కానీ వాటి నుంచి స్పందన అంతంత మాత్రమే ఉండడంతో వ్యర్థాలు రోడ్ల పక్కనే పేరుకుపోతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా భవన నిర్మాణ వ్యర్థ్యాలు అనుమతి లేని ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యం నీరుగారుతుంది.

News August 12, 2024

మూసీ పేరిట అప్పులు తెచ్చే పనిలో ప్రభుత్వం?

image

మూసీ పేరిట అప్పులు తెచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ చుట్టూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చక్కర్లు కొడుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 55 కిలోమీటర్ల మేర విస్తరించిన మూసీ నది సుందరీకరణ పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటోంది. భారీ అంచనా వ్యయానికి తగినట్లు బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించి.. మూసీ పేరిట అప్పులు తెచ్చే పనిలో పడింది.

News August 12, 2024

మౌస్ డీర్ సంతతి కేంద్రంగా నెహ్రూ జూపార్క్

image

నెహ్రూ జూపార్క్ మూషిక జింకల (మౌస్ డీర్) సంతతి వృద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియన్ వైల్డ్ యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలోని షెడ్యూల్-1లో మూషిక జింకను చేర్చారు. దేశంలో ఇవి కనుమరుగవుతున్న నేపథ్యంలో 2010 మార్చి 3న, నెహ్రూ జూపార్క్‌ను ఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ వాటి సంతతి కేంద్రంగా దీన్నిిి గుర్తించింది. ఆ తర్వాత ఇందులో 500 మూషిక జింకలు జన్మించాయి.

News August 12, 2024

HYD: రేవంత్‌ను అంటే బండి సంజయ్‌కు కోపమెందుకు?: రావుల

image

హామీల విషయంలో రేవంత్‌ను తమ పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే కాంగ్రెసోళ్లే పట్టించుకోరని, కానీ బండి సంజయ్‌కు కోపమెందుకు వస్తుందని BRS సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ప్రశ్నించారు. KTRను జైల్లో పెట్టాలని బండి అంటున్నారని, పదేళ్లు KTRఐటీ మంత్రిగా ఉండి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. బండిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌‌‌కు పంపించాలని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు నిధులు తేలేదన్నారు.

News August 12, 2024

HYD: 1000 లైబ్రరీ పోస్టులతో నోటిఫికేషన్‌కు వినతి

image

గ్రేడ్-1, 2, 3లో 1000 లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ ఛైర్మన్ డా. రియాజ్‌ను లైబ్రేరియన్ విద్యార్థులు కోరారు. డా.రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ డెవలప్‌మెట్ ఫోరం HYDలో నిర్వహించిన వన్ డే వర్క షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయం చేయాలన్నారు.

News August 12, 2024

AP సీఎం చంద్రబాబుతో HYD BRS ఎమ్మెల్యే

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలకు తెలంగాణ ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఏపీ సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

News August 12, 2024

HYD: బడ్జెట్లో రింగ్ రైలుకు నిల్.. ఆశలు గల్లంతు!

image

రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రవాణా ఆధారిత అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ప్రతిపాదిత రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా రూ.12,048 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. అయినా తాజా బడ్జెట్లో దీనికి ఎలాంటి మోక్షం కలగలేదు. దీంతో ప్రస్తుతానికి రింగ్ రైల్ ఆశలు గల్లంతయ్యాయినట్టే!