India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD జేఎన్టీయూలో బీటెక్ ఇంజనీరింగ్‌తో పాటు BFSI బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మైనర్ డిగ్రీ కోర్సును చదివే అవకాశం కల్పించనున్నట్లు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో సుమారు 5,000 మంది ఇంజనీరింగ్, మరో 5,000 నాన్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు JNTU దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.
HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 3,500 చెరువులన్నింటిని 3 నెలల్లో బఫర్ జోన్లను గుర్తించి నోటిఫై చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జాప్యం జరిగితే అక్రమాలతో చెరువులే కనిపించకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామన్నకుంట చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని హ్యూమన్ రైట్స్ గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
HYD నగరంలోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణకే పరిమితమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య 10 ఏళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని బంధానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం TGని అడ్మిషన్స్ తీసుకోవాలనడంతో .. తెలంగాణ తెలుగు వర్సిటీ ఈ మెరకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగువర్సిటీలో ఇక తెలంగాణ వారికే సీట్లు దక్కనున్నాయి.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సీఎం సహాయ మంత్రిగా మారిపోయారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీల్లోకి పెట్టుబడి తీసుకొస్తుంటే ఆయన ఏం చేస్తున్నారని ఆదివారం తెలంగాణ భవన్‌లో నిలదీశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా అని MLA ప్రశ్నించారు. నిరుద్యోగులు ఎన్ని పోరాటాలు చేసినా బీజేపీ నాయకులు మద్దతు ఇవ్వరని మండిపడ్డారు.
HYDRA బలోపేతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. GHMC, HMDAలో పోలీస్ శాఖ నుంచి 188 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. వీటికి తోడు 1,490 నూతన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ అవుట్‌సోర్సింగ్ పద్ధతిన జరగనుంది. GHMC ప్రాంతం నుంచి ORR వరకు అర్బన్ కోర్ రీజియన్ ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వం, HYD డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ సంస్థను ఏర్పాటు చేసింది.
HYDలో మరో దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోరబండ పీఎస్ పరిధి కార్మికనగర్‌లోని NI-MSME గ్రౌండ్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు దాడి చేసి, అతడి గొంతుకోసి హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నగరం మొత్తం ఇక సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండనుంది. HYD కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ సర్వైలెన్స్ కోసం రూ.50 కోట్లు, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రూ.18 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సేఫ్టీ ప్రాజెక్టులో భాగంగా మహిళ భద్రత కోసం నిర్భయ ఫండ్ కింద ప్రత్యేక కేటాయింపులు జరిపింది. నగరాన్ని భద్రతా వలయంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపింది.
TGSPDCL పరిపాలన సౌలభ్యం రీత్యా మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లుగా విభజించారు. దాదాపుగా అన్ని విభాగాల్లో విద్యుత్ కనెక్షన్లు 60 లక్షలకు పైగా దాటాయి. వీటి నుంచి దాదాపు ఏటా రూ.23,000 కోట్ల బిల్లింగ్ డిమాండ్ వస్తుండగా.. ఈ ఏటా రూ.24,000 కోట్ల బిల్లింగ్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీఎస్సీ (హన్స్) మొదటి ఏడాది ప్రవేశం కోసం ఈ నెల 12న ఆన్ లైన్‌లో అప్లికేషన్లు తీసుకుంటామని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఈఏపీసెట్- 2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం MMTS రెండోదశ పనుల కోసం దాదాపు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. సీతాఫల్మండి, మౌలాలి మధ్య రెండో లైన్ నిర్మాణం, సికింద్రాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, ఘట్‌కేసర్, మౌలాలి, సనత్ నగర్, లింగంపల్లి, తెల్లాపూర్ మార్గాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లభించనుంది. ఈ మార్గాల్లో 10 MMTS రైళ్ల వరకు కొనేందుకు వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.