RangaReddy

News August 10, 2024

HYD: Way2 News కథనంపై స్పందించిన రిజిస్ట్రార్

image

PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ అనే శీర్షికపై Way2 Newsలో వచ్చిన కథనానికి JNTU యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు. సోమవారం PHD ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

News August 10, 2024

HYDలో త్వరలో 5 ఎకరాల్లో ఫుట్‌బాల్ కోర్టులు!

image

గ్రేటర్ HYD నగరంలో ఫుట్‌బాల్ పై ఆసక్తి పెంచడంతో పాటు, క్రీడాకారులను తయారు చేసినందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తోంది. అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో జోన్ ప్రాంతంలో ఒక్కో ఫుట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

News August 10, 2024

HYD: స్కిల్ యూనివర్సిటీ.. మొదట 6 కోర్సులు

image

HYD శివారు RR జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల శంకుస్థాపన జరిగిన విషయం విదితమే. స్కిల్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరంలోనే 6 కోర్సులతో ప్రారంభం కానుంది. అయితే మొత్తం వర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిక్షణ 3 నుంచి 6 నెలలు ఉంటుందని, డిగ్రీతో పాటు డిప్లొమా కోర్సులు ఉంటాయన్నారు. ఏడాదికి రూ.50 వేల నామమాత్రపు ఫీజు వసూలు చేయనున్నారు.

News August 10, 2024

HYD: ఎమ్మెల్యే హౌస్ ARREST

image

పాతబస్తీ పరిధి బహుదూర్‌పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ను పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. శాస్త్రిపురంలో 12 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో 5 ఎకరాలను కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. శనివారం అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ఎమ్మెల్యే ముబీన్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.

News August 10, 2024

HYD: PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ

image

JNTU పరిధిలో PHD పరీక్షల ఫలితాల విడుదలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. జులై 20,21వ తేదీన ప్రవేశ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు ఫలితాలు వెల్లడించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఫలితాలు విడుదల ఆలస్యం కావడంతో విద్యార్థులు దానిపై సుముఖత చూపకపోవడంతో సీట్లు మిగిలిపోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఫలితాలు విడుదల చేయాలన్నారు.

News August 10, 2024

CID డైరెక్టర్ జనరల్‌గా షికా గోయల్ బాధ్యతల స్వీకరణ

image

IPS అధికారిణి షికా గోయల్ DGP ర్యాంకు పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శనివారం HYDలో సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే షికా గోయల్ తెలంగాణ ఉమెన్ సేఫ్టీ ఇన్‌ఛార్జి డీజీగా, సైబర్ బ్యూరో డైరెక్టర్‌గా, ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ బాధ్యతలను సైతం కొనసాగించనున్నట్లు తెలిపారు.

News August 10, 2024

HYD: ప్రజలను తప్పుదారి పట్టిస్తోన్న KTR, హరీశ్‌రావు: SRR

image

బోగస్ స్టేట్‌మెంట్లతో KTR, హరీశ్‌రావు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ మీడియా కమిటీ తెలంగాణ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. HYD గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వారి నైజం మాత్రం మారలేదని అన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నీటి విషయంలో వారు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

News August 10, 2024

CID డైరెక్టర్ జనరల్‌గా షికా గోయల్ బాధ్యతల స్వీకరణ

image

IPS అధికారి షికా గోయల్ DGP ర్యాంకు పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శనివారం HYDలో సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే షికా గోయల్ తెలంగాణ ఉమెన్ సేఫ్టీ ఇన్‌ఛార్జి డీజీగా, ఫైబర్ బ్యూరో డైరెక్టర్‌గా, ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ బాధ్యతలను సైతం కొనసాగించనున్నట్లు తెలిపారు.

News August 10, 2024

HYD: ప్రజలకు రాచకొండ సీపీ సూచనలు

image

HYD నగర ప్రజలకు రాచకొండ సిపి సుధీర్ బాబు వర్షాకాలం వేళ పలు సూచనలు చేశారు. ✓రోడ్డు పై వాహనం నడిపే సమయంలో సడన్ బ్రేక్స్ వేయకండి ✓ఒక వాహనానికి మరో వాహనానికి మధ్య 10 ఫీట్ల దూరం పాటించండి ✓తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి ✓కారులాంటి వాహనాలు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి ✓తడిగా ఉన్న రోడ్ల పై అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని అన్నారు.

News August 10, 2024

HYD సిటీ పోలీస్ కమిషనరేట్‌కు రూ.316.44 కోట్లు

image

HYD కమిషనరేట్ పరిధిలో 2023-24వ సంవత్సరంలో రూ.176.26 కోట్లు కేటాయించగా, 2024-25 సంవత్సరంలో రూ.316.44 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బందోబస్తు కోసం రూ.12.30 కోట్లు, కమ్యూనిటీ పోలీసింగ్ కోసం రూ.10 లక్షలు, చిన్నారుల మహిళా భద్రత కోసం రూ.20 లక్షలు, సీసీ టీవీ నిఘా కోసం రూ.50 కోట్లు, వ్యవస్థీకృత నేరాలపై పోరాటం కోసం రూ.18.45 కోట్లు, భవనాల నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించారు.