India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశ్రాంత మహిళా ఉద్యోగిని నుంచి సైబర్ నేరస్థులు నగదు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD నగరానికి చెందిన విశ్రాంత మహిళా ఉద్యోగినికి(80) గుర్తు తెలియని వ్యక్తి ఢిల్లీ CP అని ఫోన్ చేశాడు. మీ మొబైల్ నంబర్‌తో మత్తు పదార్థాల పార్సిల్ వచ్చిందని అరెస్టు చేస్తామని బెదిరించాడు. భయపడ్డ బాధితురాలు నేరగాడు చెప్పిన ఖాతాకు రూ.22 లక్షలు జమ చేశారు. ఆ తర్వాత మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
HYD నగరంలో వరద నీటి కాలువలో నీరు నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. నాలాల్లో నీటి నిల్వ వల్ల దోమల బ్రీడింగ్‌కు అవకాశం ఉందన్నారు. అలాంటి సందర్భంలో దోమలు వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ వాటర్ డ్రైన్, మూసీ నదిలో వరద నీరు నేరుగా వెళ్లకపోవడం మూలంగా నిల్వ ఉండిపోతున్నాయన్నారు. ఫలితంగా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు.
దేశంలోని 6 ప్రధాన నగరాలైన HYD, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే ప్రాంతాల్లో వరదల నియంత్రణకు రూ.2,514.36 కోట్లతో కేంద్రం 6 ప్రాజెక్టులను రూపొందించింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నీతి అయోగ్ అధ్యక్షుడు సుమన్ బేరిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనుమతి లభించింది.రూ.470.50 కోట్లతో యువ ఆపద మిత్ర పథకంలో NCC,NSS,NYKS భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చెందిన 2.37 లక్షల వాలంటీర్ల సేవలను ఉపయోగించనున్నారు..
HYD పంజాగుట్ట నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ప్రకటనలో కోరింది. ఇందులో భాగంగా బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్ 100 సీట్లు, బీఎస్సీ డిగ్రీ కోర్సులో 100 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆసక్తి గల వారు ఈ నెల 23లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ తదితర ప్రాంతాలలో ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ZC హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. దరఖాస్తుల సవరణ, పథకాలు అందనివారికి అందేలా చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
✓రాయపోల్ గ్రామంలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
✓అసైన్డ్ భూములు అర్హులకు అందేలా చూస్తాం:భట్టి
✓బంజారాహిల్స్: ఆదివాసి భవన్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
✓5 లక్షల మంది మహిళలకు AI పై త్వరలో శిక్షణ
✓ఆగస్టు 15 నుంచి ఆర్టిసి బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే ఛాన్స్
✓క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ విచారించాలి:హైకోర్టు
ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, వివేకానంద క్లినిక్స్ నూతన శాఖను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. హాస్పిటల్లో ఆధునిక శాస్త్ర చికిత్సకు అందజేస్తున్న టెక్నాలజీ, వైద్య సేవలను పరిశీలించారు. దేశంలో రాష్ట్రం ప్రధాన ఆరోగ్య గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
ఇందిరాగాంధీ కాలంలో భూమి లేని పేదలకు పంచిన ఆసైన్డ్ భూములు తిరిగి అర్హులకే చెందేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్‌గుల్ రైతులు ప్రగతిభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిసి తమకు కేటాయించిన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లాది నిధులను సమకూరుస్తున్న పర్యాటక సంస్థ రిసార్ట్స్, ఫుడ్ కోర్టులను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధమైంది. మొదటగా గోల్కొండ ఇబ్రహీంబాగ్ సమీపంలోని తారామతి బారాదరి ఫుడ్ కోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా సుమారు కోటికి పైగా పర్యాటక సంస్థకు ఆదాయాన్నిచ్చే ఫుడ్ కోర్టును ప్రైవేట్ పరం చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
ఏఐ రంగంలో మహిళా సాధికారత సాధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), సౌత్ ఏషియన్ ఉమెన్ ఇన్ టెక్నాలజీ (ఎస్ఏడబ్ల్యు ఐటీ), ఎడ్యుటెక్ కంపెనీ గువీ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచంలోకెల్లా మహిళలకు అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నాయి. జెన్ ఏఐ లెర్నింగ్ ఛాలెంజ్ పేరిట సెప్టెంబర్ 21న ఏకంగా 5 లక్షల మంది మహిళలకు శిక్షణ అందించనున్నాయి.
Sorry, no posts matched your criteria.