India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జవహర్‌నగర్‌లో కుక్కల దాడికి బాలుడు మృతిచెందిన ఘటన మరువకముందే HYD శివారులో మరో ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్(4) ఇటీవల స్కూల్‌కు వెళ్లి వస్తుండగా అతడిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలవగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాజాగా బాలుడు మృతిచెందాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. HCA అపెక్స్ కౌన్సిల్ రిలీజ్ చేసిన ప్రకటన ఆధారంగా ఎలాంటి మ్యాచ్లు నిర్వహించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించింది.
భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధమైనదని హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బోర్డు ఛైర్మన్, మెంబర్స్ దాఖలు చేసిన అప్పీలును డిస్మిస్ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక అధికారిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నియామకాన్ని సమర్థించింది. బోర్డు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు ముఖ్య సూచిక చేసింది. ఆగస్ట్ 15 నుంచి వారం రోజులపాటు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అందుకే విమాన ప్రయాణాలు చేసే వారు ఎయిర్ పోర్ట్‌కు ముందుగానే చేరుకోవాని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. రాఖీ పండుగ కారణంగా ప్యాసింజర్లు రద్దీ పెరుగుతుందని ఎయిర్ పోర్ట్ అంచనా వేసింది. ఈమేరకు ఫ్లైట్ సమయానికంటే ముందే బయలుదేరాలని సూచించింది.
ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానున్నాయి. టీజీపీజీఈసీ/టీజీపీజీఈసెట్-2024 ప్రవేశాల రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఈ నెల 16న శంకర్‌పల్లికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపాలిటీలో కేంద్ర పథకం అమృత్ 2.0 కింద రూ. 32 కోట్లతో నిర్మించే వాటర్ ట్యాంకు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. టీయూఎఫ్ ఐడీసీ నిధులు రూ.21 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హై రేంజ్ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 70 ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా ట్రాఫిక్ జామ్‌ను గుర్తించి క్లియర్ చేయనున్నారు.
నిమ్స్‌లో 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అనుబంధ హెల్త్ సైన్సెస్‌లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. బీపీటీలో 50, బీఎస్సీ నర్సింగ్‌లో 100, బీఎస్సీ డిగ్రీలో 100 సీట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నెల23 లోపు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని నిమ్స్ డీన్ రాజశేఖర్ గురువారం వివరించారు.
సచివాలయ భద్రత మళ్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం(టీజీఎస్సీ) సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా వీరి స్థానంలో ఎస్పీఎఫ్ మోహరించే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే రానుంది.
నాగులపంచమి రోజున పూజల పేరుతో పాములను పట్టుకుని హింసించవద్దని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ అధ్యక్షుడు జస్‌రాజ్‌శ్రీ శ్రీమల్, ప్రధాన కార్యదర్శి మహేశ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పాములను హింసించే వారి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.