India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.
శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం శంకర్‌పల్లి మం. చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని పూజిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రావణమాస శుక్రవారం సందర్భంగా స్వామికి నేడు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్షేత్రం HYDకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెహదీపట్నం నుంచి శంకర్‌పల్లికి 505 నం. బస్సులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి చందిప్పకు ఆటోలు ఉంటాయి.
ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని TPTLF(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్) డిమాండ్ చేస్తోంది. నాంపల్లిలో విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకి మెమోరాండం అందజేశారు. రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్ జునుగారి, నాయకులు సాయి కిరణ్ ఉన్నారు.
HMDAలో కొత్తగా 2 జోన్లు పెంచారు. ఇప్పటివరకు ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్‌పల్లి HMDA పరిధిలో ఉండేవి. ఇకమీదట ఘట్‌కేసర్, శంషాబాద్‌తో పాటు మేడ్చల్-1, మేడ్చల్-2, శంకర్‌పల్లి-1, శంకర్‌పల్లి-2 అని రెండు జోన్లుగా విభజించారు. శంకర్‌పల్లి జోన్-1కు ప్రసాద్ రావు, శంకర్‌పల్లి-2కు మల్లికార్జునరావుకు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్-1కు గోపిక రమ్య, మేడ్చల్-2కు శాలినికి ప్లానింగ్ అధికారిగా నియమించారు.
హైదరాబాదులో పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వ తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్రానెట్ విన్ ఓవెన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలు చర్చించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం అని అన్నారు.
✓HYDలో కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటాం:భట్టి
✓ఉస్మానియా మెడికల్ కాలేజీకి ISO గుర్తింపు
✓దిల్సుఖ్ నగర్: బస్ కండక్టర్ పై పాము విసిరిన వృద్ధురాలు
✓అల్వాల్: వెల్నెస్ స్పా సెంటర్లో వ్యభిచారం
✓రంగులు మార్చడంలో OYC బ్రదర్స్ ఊసరవెల్లిని మించారు: ఫిరోజ్ ఖాన్
✓ఆగస్టు 14న కాగ్నిజెంట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
✓శంషాబాద్: ఏపీ డ్రైవర్లను హైదరాబాదులో తిరగనివ్వాలి: పవన్ కళ్యాణ్
దాదాపు 650 చదరపు కి.మీటర్ల విస్తీర్ణం గల హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19.43 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. అందులో 2.7 లక్షల కమర్షియల్ గృహాలు ఉన్నాయి. GIS సర్వే పూర్తికాగానే ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. GIS డిజిటల్ బోర్డ్‌తో ప్రజలు ప్రభుత్వ సేవలను ఇంటినుంచే పొందే వీలు ఉంటుందన్నారు.
ఉస్మానియా మెడికల్ కళాశాల ISO-9001-2015 గుర్తింపు దక్కింది. ఆ సంస్థ ప్రతినిధి శివయ్య గుర్తింపు పత్రాన్ని కళాశాల డా.నరేంద్ర కుమార్‌కు అందజేశారు. తెలంగాణలో రెండోసారి ISO గుర్తింపు తమ కళాశాలకు దక్కడం అభినందనీయం అన్నారు. వైస్ ప్రిన్సిపల్‌లు డా.శంకర్, డా.పద్మావతి, ఏడీ డా.శ్రీధర్ చారి మాజీ వైస్ ప్రిన్సిపల్ డా.టక్యుద్దీన్ ఉన్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో రాజధాని దూసుకెళ్తోంది. దేశంలోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. హౌస్ EMI- ఆదాయ నిష్పత్తి ఆధారంగా ఇండియాలోని 8 ప్రధాన నగరాలను ఎంచుకుంది. దీని ప్రకారం 51 శాతం నిష్పత్తితో ముంబై తొలిస్థానంలో ఉంది. 30 శాతంతో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది.
AP క్యాబ్ డ్రైవర్లను HYDలో తిరగనివ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్స్ నాయకులు మండిపడ్డారు. మోటర్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించడం నేరమని క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ పేర్కొన్నారు. కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన క్యాబ్ డ్రైవర్ల వాగ్వాదం చిలికి చిలికి, గాలి వానలా మారింది.
Sorry, no posts matched your criteria.